ఇటీవల కాలంలో ఓటీటీ మూవీ లవర్స్ ని కొరియన్ సినిమాలతో పాటు మలయాళం సినిమాలు కూడా బాగా ఆకర్షిస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే ఈ వారం కొన్ని కొత్త, ఇంట్రెస్టింగ్ మలయాళ సినిమాలు ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నాయి. అందులో మూడు మాత్రం మోస్ట్ అవైటింగ్ సినిమాలు అని చెప్పాలి. మరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఓటీటీలోకి రాబోతున్న మలయాళ సినిమాలు, ఆయా సినిమాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. 


వాలియెట్టాన్ 
2000 ఏడాదిలో రిలీజ్ అయ్యి, సంచలనం విజయం సాధించిన మమ్ముట్టి ఓల్డ్ మూవీ 'వాలియెట్టాన్'. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన సినిమాను ఇప్పుడు ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు ? అంటే... దానికో ప్రత్యేకమైన కారణమే ఉంది. ఈ మూవీ గత ఏడాది 4k వెర్షన్ లో థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు ఇదే 4k వెర్షన్ ను మమ్ముట్టి అభిమానుల కోసం మనోరమా మ్యాక్స్ అనే ఓటీటీలో ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నారు. 


వివేకానందన్ వైరల్ 
'వివేకానందన్ వైరల్' అనే మూవీ దాదాపు ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో లీడ్ రోల్ పోషించిన ఈ మూవీ 2024 జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ పాయింట్ తో రూపొందిన ఈ మలయాళ కామెడీ డ్రామాకు థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ మూవీకి కమల్ దర్శకత్వం వహించగా, గ్రేస్ ఆంటోని, మరీనా, మంజు పిళ్లై, స్వస్తిక తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 7న ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో 'వివేకానందన్ వైరల్' మూవీ రిలీజ్ కాబోతోంది. మరి పగలబడి నవ్వడానికి మీరు రెడీనా? 


స్వర్గం 
'స్వర్గం' అనే మరో మలయాళ ఈ వీక్ ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇదొక ఫ్యామిలీ డ్రామా. రెజిస్ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ... థియేటర్లలో రిలీజ్ అయిన 3 నెలల తర్వాత ఓటీటీలోకి అడుగు పెడుతోంది. అజు వర్గీస్, జానీ ఆంటోనీ, అనన్య లీడ్ రోల్స్ పోషించిన ఈ సినిమాలో జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఓ కుటుంబం కలిసికట్టుగా ఎలా ఎదుర్కొంటుందో చూపిస్తారు. ఈ ఫ్యామిలీ డ్రామాను ఈ శుక్రవారం మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 7 నుంచి 'స్వర్గం' మూవీ స్ట్రీమింగ్ కానుంది. 


రేఖాచిత్రమ్ 
మలయాళ మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మరో మలయాళ సినిమా 'రేఖాచిత్రమ్'. ఈ ఏడాది జనవరి 9న థియేటర్లలోకి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫిబ్రవరి 5 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. కేవలం 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 55 కోట్లు కొల్లగొట్టింది. దీనికి జోఫిన్ చాకో దర్శకత్వం వహించగా, ఆసిఫ్ అలీ లీడ్ రోల్ పోషించారు. 40 హత్య కేసు ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈ మూవీ సాగుతుంది.



Read Also : Upcoming February Releases : ఫిబ్రవరిలో సినిమాల జాతర - థియేటర్లలోకి 15 సినిమాలు... ఆ రెండూ పోస్ట్ పోన్ అయినట్టేనా ?