ETV Win Upcoming Movies: 'ఈటీవీ విన్' ఓటీటీలో ఈ నెలంతా సినిమాల జాతర... ఫిబ్రవరిలో రిలీజ్ చేసే మూవీస్ లిస్ట్ వచ్చేసిందోచ్

Upcoming Movies on ETV Win OTT : అచ్చ తెలుగు ఓటీటీలలో ఒకటైన ఈటీవి విన్ ఓటీటీ కొత్త ట్రెండ్ ను మొదలుపెట్టింది. తాజాగా ఈటీవీ విన్ అనౌన్స్ చేసిన ఫిబ్రవరి సినిమాల లిస్ట్ ను చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది.

Continues below advertisement

ఇటీవల కాలంలో ఎంటర్టైన్మెంట్ అంటే ఓటీటీ, ఓటీటీ అంటే ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా మారింది ట్రెండ్. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా అన్నీ జానర్ల సినిమాలు, అన్నీ భాషాల్లో ఓటీటీలలో అందుబాటులో ఉంటున్నాయి. అదే విధంగా ప్రత్యేకంగా ఒక్కో భాషకు కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా ఉన్నాయి. అందులో ఈటీవీ విన్ కూడా ఒకటి. ఇక ప్రతి నెల మొదట్లోనే తన ఓటీటీలో రాబోతున్న సినిమాల లిస్ట్ ను అన్నీ ఓటీటీ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. దీనివల్ల ప్రేక్షకులకు ఏ ఓటీటీలో ఏ మూవీ రాబోతోంది అనే క్లారిటీ ముందుగానే వస్తుంది. తాజాగా ఈటీవి విన్ కూడా ఇదే పని చేసింది. 

Continues below advertisement

ఈటీవీ విన్ అప్ కమింగ్ సినిమాల అనౌన్స్మెంట్ 
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ తమ ఓటీటీలో ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్ తాజాగా అనౌన్స్ చేసింది. ఈ లిస్ట్ లో పలు ఓల్డ్ తెలుగు రొమాంటిక్ సినిమాల నుంచి, ఇటీవల కాలంలో రిలీజ్ అయిన మరికొన్ని సినిమాలను కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు వెల్లడించారు. కానీ ఇందులో చాలావరకు పాత సినిమాలే ఉండడం గమనార్హం. "దిస్ ఫిబ్రవరి... గెట్ రెడీ ఫర్ ఎగ్జైటింగ్ లైనప్, ఫ్రెష్ కంటెంట్ ఆన్ ఈటీవీ విన్... గ్రిప్పింగ్ సినిమాల నుంచి కడుపుబ్బా నవ్వుకునే కామెడీ సినిమాలు, మనసును కదిలించే ఎమోషనల్ స్టోరీలు... ప్రతి ఒక్కరి కోసం, అన్ని జానర్ల సినిమాలు అందుబాటులోకి రాబోతున్నాయి" అంటూ డేట్స్ వైజ్ ఫిబ్రవరి మొదటి నుంచి ఎండింగ్ వరకు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల లిస్టును వెల్లడించింది. జనవరి 6 నుంచి మొదలు పెడితే జనవరి 28 వరకు ఈటీవీ విన్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సినిమాల జాతరే ఇక.  

తేదీల వైజ్ గా అప్ కమింగ్ సినిమాల లిస్ట్ 

ఫిబ్రవరి 6 
అలా మొదలైంది 
అతడు 
బేవర్స్ 
బిచ్చగాడా మజాకా 
బ్లఫ్ మాస్టర్ 
బాడీగార్డ్ 
క్రేజీ ఫెల్లో 
ఫిదా 
ఖాకి 
మోసగాళ్లకు మోసగాడు 
ఊరు పేరు భైరవకోన 
పాండురంగడు 
సింహ 
తర్వాత ఎవరు 
టాప్ గేర్ 
వాన 

ఫిబ్రవరి 20 
ఎవడు 
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 
శ్రీరామదాసు 
చింతకాయల రవి 
స్టాలిన్ 
రామయ్య వస్తావయ్య 
నాగవల్లి 
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ 
మొగుడు 
అదిరిందయ్యా చంద్రం 
లవ్లీ 
అదుర్స్ 
సోలో 
కొంచెం ఇష్టం కొంచెం కష్టం 

ఫిబ్రవరి 13 
సమ్మేళనం 

ఫిబ్రవరి 27 
కౌసల్య సుప్రజా రామ 

ఫిబ్రవరి 28 
దడ 
నేను నా రాక్షసి 
కేరాఫ్ సూర్య 
ప్రేమికులు 
షాక్ 
రాణి గారి బంగ్లా 
న్యాయం కావాలి

Also Readఉపేంద్ర 'యూఐ' నుంచి సుదీప్ 'మ్యాక్స్' వరకూ... ఫిబ్రవరిలో ఓటీటీలోకి రాబోతున్న కన్నడ సినిమాల లిస్ట్‌ ఇదిగో

ఓల్డ్ కంటెంట్ తో కొత్తగా... 

ఈటీవీ విన్ తాజాగా ప్రకటించిన ఈ లిస్టులో ఆల్మోస్ట్ అన్నీ పాత సినిమాలే ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్న సినిమాలు. ఈ సినిమాలు టీవీలో ఎన్ని సార్లు ప్రసారమైనా మంచి టిఆర్పి రేటింగ్ దక్కించుకుంటాయి. అందుకే ఓల్డ్ కంటెంట్ తో కొత్తగా ప్రేక్షకుల దృష్టిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఈటీవీ విన్. ఇప్పటిదాకా డిజిటల్ స్ట్రీమింగ్ విషయంలో ఓ ట్రెండును ఫాలో అవుతున్నారు. దాని ప్రకారం థియేట్రికల్ రన్, ఓటీటీ స్ట్రీమింగ్లో, తర్వాత శాటిలైట్ స్ట్రీమింగ్ మొదలవుతుంది. ఇక ప్రతి సినిమాకు ఓటిటిలో డెడ్ లైన్ పూర్తి కాగానే డిలీట్ చేస్తారు. కానీ ఈటీవీ విని మాత్రం కొత్తగా ఓల్డ్ కంటెంట్ మొత్తాన్ని తమ ఓటీటీలో నింపేస్తుంది. ఇలాంటి సినిమాలను మళ్లీ మళ్లీ చూడాలనుకునే వారికి ఈటీవీ విన్ కేరాఫ్ అడ్రస్ గా మారబోతోంది. 

Read AlsoAllu Arjun : ఓటీటీ నుంచి అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ అవుట్.. డిలీట్ చేయకముందే చూడండి

Continues below advertisement