Allu Arjun Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఒకటి ఓటీటీ నుంచి అతి త్వరలో డిలీట్ కాబోతోంది. గత ఐదేళ్ల నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్న దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ మూవీని పర్మనెంట్ గా డిలీట్ చేయబోతోంది. అలా డిలీట్ కాకముందే అల్లు అర్జున్ అభిమానులు ఈ మూవీని ఓటీటిలో చూడడానికి ఛాన్స్ ఉంది. 


మరో నెల రోజుల్లో ఓటీటీ నుంచి డిలీట్ 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల లిస్ట్ లో 'అల వైకుంఠపురం'లో కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 'పుష్ప' మూవీ రిలీజ్ కి ముందు 'అల వైకుంఠపురం'లో సినిమాతోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. 'బుట్ట బొమ్మ' సాంగ్ అన్ని భాషల ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో అల్లు అర్జున్ హీరోగా నటించగా... పూజా హెగ్డే, టబు, సుశాంత్ కీలకపాత్రలు పోషించారు. తమన్ ఈ మూవీకి సంగీతం అందించగా, అల్లు అరవింద్ - రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ 2020 జనవరి 13న థియేటర్లోకి వచ్చింది. ఓటీటీలో మాత్రం 2020 ఫిబ్రవరి 27న స్ట్రీమింగ్ అయింది. 


2020 నుంచి ఇప్పటిదాకా నెట్ ఫ్లిక్స్ లో 'అల వైకుంఠపురం' మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓ సినిమా తెలుగు సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఇన్ని ఏళ్ల పాటు స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండడం అనేది బహుశా ఇదే మొదటిసారి అయి ఉండొచ్చు. అయితే ఐదేళ్ల తర్వాత నెట్ ఫ్లిక్స్ ఈ మూవీని తమ ఓటీపీ ప్లాట్ఫామ్ నుంచి డిలీట్ చేయబోతోంది. 2025 ఫిబ్రవరి 27 వరకు మాత్రమే 'అల వైకుంఠపురం'లో మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుంది. అంతలోపు ఎవరైనా ఈ మూవీని ఓటీటీలో చూడాలి అనుకుంటే హ్యాపీగా చూడొచ్చు. ఆ తర్వాత మాత్రం ఈ మూవీ నెట్ ఫిక్స్ లో ఉండే ఛాన్స్ లేదు. 


అదిరిపోయే కథ... 
బంటు, రాజ్ ఇద్దరూ ఒకే ఆస్పత్రిలో ఒకే టైంలో పుడతారు. కానీ తేడా ఏంటి అంటే బంటు ఫ్యామిలీ మిడిల్ క్లాస్. కానీ రాజ్ మనోహర్ ఫ్యామిలీ రిచ్. బంటు వాళ్ళ నాన్న వాల్మీకి రాజ మనోహర్ తండ్రి, విఆర్కే కంపెనీ అధినేత రామచంద్ర రావు దగ్గర వర్క్ చేస్తాడు. అయితే వాల్మీకి పెట్టే టార్చర్ తో బంటు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఈ నేపథ్యంలోనే అమూల్య అనే అమ్మాయితో బంటు పరిచయం ప్రేమగా మారుతుంది. అదే అమ్మాయిని రాజ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని రామ చంద్రరావు ఫ్యామిలీ నిర్ణయిస్తుంది. కానీ రాజ్ మరో అమ్మాయిని ప్రేమిస్తాడు.


మరోవైపు అప్పలనాయుడు తన కొడుకు కోసం వీఆర్కే కంపెనీలో షేర్ కావాలని గొడవ పడతాడు. అంతలోనే రామచంద్రరావుపై హత్యాయత్నం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బంటు ఆయన్ని కాపాడగా, ఓ షాకింగ్ నిజం తెలుసుకుంటాడు. రామచంద్ర రావును కాపాడ్డానికి వైకుంఠపురంలో అనే ఆయన ఇంట్లోకి అడుగు పెడతాడు బంటు. సొంత తండ్రి బంటును ఎందుకు టార్చర్ పెడుతున్నాడు? బంటుకు తెలిసిన నిజమేంటి? చివరకు రామచంద్రరావుని హీరో కాపాడగలిగాడా? బంటు, రామచంద్రరావు ఫ్యామిలీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.



Also Readఫస్ట్ మూవీకి 10 రూపాయలే... తర్వాత ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యెస్ట్ పారితోషికం అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?