'అమరన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో శివ కార్తికేయన్. తన కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా రూపొందుతున్న 25వ సినిమాను నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగరతో చేస్తున్నాడు. ఈ మూవీకి 'పరాశక్తి' అనే పవర్ ఫుల్ టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేస్తూ, టైటిల్ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో జయం రవి. అథర్వ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ భాస్కరన్ ఈ పవర్ ఫుల్ పొలిటికల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న మూవీని నిర్మిస్తున్నారు. విజయ్ ఆంటోనీ కూడా తన 25వ సినిమాకు 'పరాశక్తి' టైటిల్ అనౌన్స్ చేయడంతో వివాదం మొదలైంది. అయితే... శివ కార్తికేయన్, విజయ్ ఆంటోనీల సినిమాల కంటే తమిళంలో పరాశక్తి పేరుతో మరో సినిమా వచ్చింది.  


'పరాశక్తి' ఏ ఓటీటీలో ఉందంటే ? 


ఒకప్పటి కోలీవుడ్ కల్ట్ క్లాసిక్ సినిమాలలో 'పరాశక్తి' కూడా ఒకటి. దిగ్గజ నటుడు శివాజీ గణేషన్ నటించిన ఈ మూవీ 73 సంవత్సరాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఈ ఐకానిక్ మూవీ టైటిల్ ని శివ కార్తికేయన్ వాడుకోవడం పై వివాదం నెలకొంది. ఇక ఈ నేపథ్యంలోనే దాదాపు 7 దశాబ్దాల తర్వాత ఫస్ట్ టైం 'పరాశక్తి' మూవీని డిజిటల్ గా స్ట్రిమింగ్ చేయబోతున్నారు. ఈ మూవీ సింప్లి సౌత్ అనే ఓటీటీ అందుబాటులో ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ 'పరాశక్తి' మూవీ భారత దేశంలో మినహా ప్రపంచ వ్యాప్తంగా వీక్షించడానికి అందుబాటులో ఉంటుందని సింప్లీస్ సౌత్ అనౌన్స్ చేసింది.






'పరాశక్తి' స్టోరీ ఏంటంటే...


రెండో ప్రపంచ యుద్ధం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఓ తమిళ కుటుంబం జీవితంలో ఎదురయ్యే వరుస దురదృష్టాల చుట్టూ తిరుగుతుంది. చంద్రశేఖరన్, జ్ఞానశేఖరన్, గుణశేఖరన్ అనే ముగ్గురు అన్నదమ్ములు భారతీయ వలసదారులుగా మయన్మార్లో నివసిస్తారు. వాళ్ళ బావ ప్రమాదంలో మరణించడంతో వారికున్న ఏకైక సోదరి వితంతువుగా మిగులుతుంది. ఆ తర్వాత ఆలయ పూజారి ఆమెను లైంగికంగా వేధిస్తాడు. మరోవైపు తండ్రి షాక్ తో చనిపోతాడు. మరి ఆ తర్వాత ఈ సోదరులు ఏం చేశారు? అన్నది స్టోరీ. నిజానికి ఇది శివాజీ గణేషన్ ఫస్ట్ మూవీ. ఇందులో శ్రీ రంజని, దురై స్వామి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో ఈ మూవీని కృష్ణన్ పన్జు దర్శకత్వం వహించగా, నేషనల్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఆర్ సుదర్శనం ఈ మూవీకి సంగీతం అందించారు. 


Also Read'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?


ఇద్దరు హీరోల మధ్య 'పరాశక్తి' టైటిల్ వివాదం 


ఇలా శివాజీ గణేషన్ నటించిన ఫస్ట్ మూవీ టైటిల్ ని ఇప్పుడు శివ కార్తికేయన్ వాడుకోవడం పట్ల ఆయన అభిమానులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరోవైపు ఈ మూవీ టైటిల్ విషయంలో ప్రస్తుతం ఉన్న ఇద్దరు కోలీవుడ్ స్టార్స్ మధ్య కూడా వివాదం నెలకొంది. 'పరాశక్తి' అనే టైటిల్ తో ఓవైపు శివ కార్తికేయన్, మరోవైపు విజయ్ ఆంటోనీ తమ సినిమాలను అనౌన్స్ చేశారు. అయితే విజయ్ ఆంటోనీ తాను ముందుగా సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ లో టైటిల్ రిజిస్టర్ చేశాను అని చెప్తుంటే, తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ - తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో మేమే ముందుగా ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించామని శివ కార్తికేయన్ టీం చెప్తోంది. మరి ఈ వివాదం ఎలా ఎండ్ అవుతుందో చూడాలి.


Also Readస్టార్ హీరోయిన్ కెరీర్ నాశనం చేసిన ఒక్క తప్పు... ఆ రాత్రంతా జైల్లోనే... ఇప్పుడు ఛాన్సుల్లేవ్, ఆవిడ ఎవరో తెలుసా?