Meghasandesam Serial Today Episode : గగన్‌ బెయిల్‌ కోసం లాయర్‌ చెప్పిన డబ్బులు భూమి తీసుకెళ్తుంటే అపూర్వ వచ్చి అడ్డగిస్తుంది. ఇది నా డబ్బు నేను తీసుకెళ్తాను అంటూ భూమి సమాధానం ఇస్తుంది. దీంతో అపూర్వ కోపంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో మీరా అక్కడకు వచ్చి కోపంగా భూమిని తీసుకెళ్లి రూంలో వేసి లాక్‌ చేస్తుంది. చెర్రి, బిందు ఎంత చెప్పినా మీరా వినదు. మరోవైపు స్టేషన్‌లో రౌడీ ఉన్న షెల్‌ లోకి ఒక దొంగను పంపిస్తారు పోలీసులు.

దొంగ: ఏంటి కేసు..

రౌడీ: నీదేంటి కేసు..

దొంగ: పిక్‌ ప్యాకెట్ కేసు.. చాలా చిన్నది. మరి నీది

రౌడీ: మర్డర్‌ చేస్తూ దొరికిపోయాను

దొంగకు ఫోన్‌ వస్తుంది. నీకే ఫోన్‌ తీసుకో అని రౌడీకి ఇస్తాడు. ఫోన్‌లో అపూర్వ మాట్లాడుతుంది.

అపూర్వ: ఏరా రాజుఎలా ఉన్నావు..?

రౌడీ రాజు: మేడం మీరా ఎలా ఉన్నావు అంటే పోలీసులు తప్పా ఎవరైనా బాగున్నాము అని పోలీస్‌ స్టేషన్‌లో చెప్తారా మేడం.

అపూర్వ: ఎంతైనా నిన్ను అభినందించాల్సిందేరా..? బాగా దెబ్బలు తిన్నాక కానీ ఆ గగన్‌ గాడి పేరు చెప్పావు. నువ్వు  అలా చెప్పడం వల్లే నీకు ఆ గగనే సుపారి ఇచ్చి ఉంటాడని ఏసీపీలో మొదలైందిరా..?

రాజు: అదే మీ టెక్నిక్‌ మేడం. మీరు అనుకుంటే అయిపోతుంది. మరి నన్ను ఈ కేసు నుంచి విడిపిస్తారా..? మేడం.

అపూర్వ: భయపడకు గగన్‌ గాడికి శిక్ష పడ్డాక నిన్ను బయటకు తీసుకొస్తాను.

రాజు: బాగా లేటవుతుందేమో మేడం..

అపూర్వ: అవుతుందిరా నువ్వు ఎంత ఓపికగా దెబ్బలు తిన్నావో అంతే ఓపికగా వెయిట్‌ చేయాలి. అలా కాదు అని నా పేరు మాత్రం బయటకు తీశావు అనుకో తెలుసుగా నీ ఫ్యామిలీ నీకు దూరం అవుతుంది.

రాజు: అంత సాహసం నేను ఎందుకు చేస్తాను మేడం. మీరు ఎప్పుడు విడిపిస్తే అప్పుడు బయటకు వస్తాను.

అపూర్వ: గుడ్‌ అలా బయపడుతూ ఉండు..

అని ఫోన్‌ కట్‌ చేస్తుంది. తర్వాత గగన్‌ ఉన్న జైలుకు వెళ్తుంది అపూర్వ

అపూర్వ: ఇక్కడ నేను అక్కడ నువ్వు మధ్యలో ఈ కటకటాలు. భూమిని నేను టచ్‌ చేస్తే ఇదే కటకటాల వెనక నన్ను వేయిస్తా అన్నావు కదూ నువ్వు.. ఇదే కటకటాలకు ముందు నేనున్నాను. వెనక నువ్వున్నావు. బలే గమ్మత్తుగా ఉంది కదూ

గగన్‌: అతిగా ఆనందపడకు అపూర్వ. ఏ తప్పు చేయని నేను తప్పకుండా బయటకు వస్తాను. అప్పుడు ఇంతకు ఇంత ఏడవాల్సి వస్తుంది.

అపూర్వ: నీ ముఖం వస్తుంది. తప్పు చేశానని నీకు నాకు తెలిస్తే సరిపోదు. కోర్టుకు తెలియాలంటే సాక్ష్యం ఉండాలి. నువ్వే తప్పు చేశావని నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే రాజారత్నం నా మనిషి. 

గగన్‌: అపూర్వ రెచ్చగొట్టకు నాకు కోపం వస్తే.. ఈ గేటు పెద్ద అడ్డు కాకపోవచ్చు.

అపూర్వ: నేను చెప్పిన మాటలు వింటూ ఆవేశంతో నా మీద అటాక్‌ చేయ్‌ చూద్దాం.

గగన్‌: నా ఆవేశానికి కొట్టుకుపోయే గడ్డిపోచ దానివి నువ్వు..

అపూర్వ: కావచ్చు కానీ ఆలోచనల్లో రాక్షసులకు అమ్మ లాంటి దాన్ని కూడా నేనేరా..నా పోలీసులు ఇక్కడ ఇద్దరు ఉన్నారు. నువ్వు నా మీద అటాక్‌ చేసిన వెంటనే నిన్ను కాల్చిపారేస్తారు. దమ్ముంటే నా మీద అటాక్‌ చేయరా..

గగన్‌: వద్దు అపూర్వ వెళ్లిపో..

అపూర్వ: ఏయ్‌ నువ్వు పిలిస్తే వచ్చే దాన్ని కాదురా..? నీ ఏడుపు చూసే వెళ్దాం అని వచ్చిన దాన్ని నువ్వు జైల్లో పడ్డాక ఫస్ట్‌ వినే బాడ్‌ న్యూస్‌ ఏంటో తెలుసా..? భూమి చావు. ఏం చేస్తావు భూమిని నేను చంపేస్తుంటే.. అడ్డుకోలేవుగా..

అంటూ అపూర్వ చెప్తుంటే.. గగన్‌ కోపంగా అపూర్వ పీక పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అపూర్వం దూరంగా ఉంటుంది. పోలీసులు వచ్చి గగన్‌ను లోపలికి తోస్తారు. అపూర్వను అక్కడి నుంచి పంపించి వేస్తారు. తర్వాత కృష్ణ ప్రసాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు వస్తాడు.

ప్రసాద్‌: నమస్తే మేడం..

ఏసీపీ: నమస్తే కృష్ణ ప్రసాద్‌ గారు

ప్రసాద్‌: గగనే మా బావ గారి మీద మర్డర్‌ అటెంప్ట్‌ చేశారని మీరు ఏ ఆధారంతో నిర్దారించుకున్నారు.

ఏసీపీ: బలమైన ఆధారం లేకుండా నేను ఎవ్వరినీ అరెస్ట్‌ చేయను. అంతకు మించి మీకు ఏం చెప్పనవసరం లేదు. వెళ్లండి.

ప్రసాద్‌: మేడం మీకో విషయం చెప్పాలి. గెస్ట్‌ హౌస్‌ కు నా ఇద్దరు కొడుకులు వస్తారని నేను ఊహించలేదు. ఆ విషయం తెలిసి ఉంటే నేను మా బావగారి మీద మర్డర్‌ అటెంప్ట్‌ చేసేవాణ్నే కాదు. మా బావ గారిని చంపాలని చూసింది నేనే మేడం. దయచేసి నన్ను అరెస్ట్‌ చేసి గగన్‌ను వదిలేయండి మేడం

అంటూ ప్రసాద్‌ చెప్పడంతో గగన్‌ షాక్‌ అవుతాడు. ఏసీపీ ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుండి పోతుంది. ప్రసాద్‌ మాత్రం నన్ను అరెస్ట్‌ చేయండి మేడం నేనే తప్పు చేశాను అని చెప్తుంటాడు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!