Brahmamudi Serial Today Episode: రూముల్లో ఉన్నవాళ్లందరూ గొడవ పడుతూ హాల్లోకి వస్తారు. అప్పు, అపర్ణ కంగారు పడతారు. అక్కడ కావ్య, రాజ్ కనిపించకపోవడంతో వెళ్లిపోయారా..? అని ఇద్దరూ అనుకుని రిలాక్స్ అవుతారు. వాళ్లిద్దరిని రుద్రాణి అనుమానిస్తుంది.
రుద్రాణి: ఎవరు వెళ్లిపోయారు
అప్పు: ఇందాక అక్క ఇక్కడే ఉండేది కదా వెళ్లిపోయిందా అని
ఇందిరాదేవి: అసలు మీరెందుకు అంత కంగారు పడుతున్నారు
అపర్ణ: కంగారెందుకు అత్తయ్యా అసలు ఎవరిని చూసి కంగారు పడాలి. ఇందాకటి నుంచి హాల్లో కూర్చోవాలి అని తెగ గొడవ చేశారు కదా ఇప్పుడు కావాల్సినంత సేపు కూర్చోండి. నా కొడుకు కోడలు ఎక్కడే ఇప్పటి వరకు హల్లోనే ఉన్నాము అని చెప్పారు కదా..?
అప్పు: నేను కూడా అక్కడి వరకే విన్నాను ఆంటీ.. తర్వాత వీళ్లంతా గొడవ చేస్తూ బయటకు వచ్చేసరికి కనిపించలేదు
అపర్ణ: ఒకవేళ బయట ఏమైనా ఉన్నారా చూద్దాం పద
అని ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారు.
రుద్రాణి: ఇప్పటి వరకు వదిన కావ్య కలిసి ఏదో గూడుపుఠాణి చేస్తున్నారు అనుకున్నాను.. సడెన్ గా ఇప్పుడు మా వదిన అప్పు వెనక తిరుగుతుందేంటి..?
రాహుల్: నాకు అదే అనుమానంగా ఉంది మమ్మీ.. ఎప్పుడూ లేనిది అప్పు మన గదిలోకి తీసుకెళ్లి మరీ రాజ్ గురించి చెప్తాను అంది. ఎందుకంటావు
రుద్రాణి: వెళ్లి ఆ పొట్టి దాన్ని అడుగు
రాహుల్: వద్దులే మమ్మీ..
కావ్య డోర్ వేయగానే.. రాజ్ వెళ్లిపోతుంటే.. సుభాష్ వస్తాడు. రాజ్‌ను చూసి ఆశ్చర్యపోతాడు. మరోవైపు ఇంటికి వచ్చిన యామిని వైదేహి వాళ్లను తిడుతుంది.
యామిని: మమ్మీ బావ వచ్చారా..? ఏం చేస్తున్నారు
వైదేహి: ఇంకా రాలేదు బేబీ
యామిని: ఇంకా రాలేదా..? ఎప్పుడో వెళ్లాడుగా
వైదేహి: అవును నువ్వు ఉన్నప్పుడే వెళ్లాడుగా బేబీ
యామిని: ఇంత సేపు ఇంటికి రాకుండా బయట ఏం చేస్తున్నాడు
యామిని పాథర్: ఏదో పనిలో ఉండి ఉంటాడులే అమ్మా
యామిని: లేటవుతుందని నాతో ఒక్కమాట కూడా చెప్పలేదు. యాక్సిడెంట్ అయి గతం మర్చిపోయిన వ్యక్తి రాలేదని మీరైనా నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా..? తనకు ఏదైనా అయితే ఎవరు రెస్పాన్స్‌బిలిటీ
వైదేహి: అయినా తను బయటకు వెళ్లినప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి తన కారులో జీపీఎస్ పెట్టావు కదా బేబీ అది ఓపెన్ చేసి చూడు
యామిని: అవును ఈ టెన్షన్‌లో అది మర్చిపోయాను ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తాను.
జీపీఎస్ యాప్ ఓపెన్ చేసిన చూసిన యామిని షాక్ అవుతుంది. రాజ్ తన ఇంటికి వెళ్లాడు అని కోపంతో ఊగిపోతుంది. మరోవైపు రాజ్‌ను చూసిన సుభాష్ పిలవబోతుంటే.. కావ్య అడ్డు పడుతుంది. తను రామ్ అని నా ఫ్రెండ్ మీకు ఇంతకు ముందు చెప్పాను కదా అంటుంది. అర్థం కాక సుభాష్ అలాగే చూస్తుండిపోతాడు. రాజ్ వెళ్లిపోతాడు. తర్వాత అపర్ణ, అప్పు, కావ్య ముగ్గురూ కలిసి సుభాష్‌కు నిజం చెప్తారు.
అపర్ణ: వాడికి ఇప్పుడిప్పుడే గతం గుర్తుకు వస్తుంది. త్వరలోనే అంతా గుర్తుకు వస్తుంది. కావ్య చెప్పినట్టు కొన్ని రోజులు ఓపిక పడదాం
సుభాష్: సరే.. వాడు బతికే ఉన్నాడని తెలుసుకున్నాను. ఇంకొన్ని రోజులే కదా ఎదురుచూస్తాను. వాడు నవ్వుతూ వచ్చి నాన్నా అని పిలిచే వరకు ఆశగా ఎదురుచూస్తాను
అంటాడు సుభాష్. యామిని కోపంగా నాకు రామ్ కావాలి తీసుకురండి అంటూ అరుస్తుంది. ఇంతలో రాజ్ రాగానే సైలెంట్ గా ఉంటుంది. ఎక్కడికి వెళ్లావు బావ అని అడుగుతుంది. రాజ్ ఫ్రెండ్ ను కలవడానికి అని చెప్పి వెళ్లిపోతాడు. యామిని వెంటనే పెళ్లి అయిపోవాలి. రేపు బావను తీసుకెళ్లి వెడ్డింగ్‌కార్డ్స్ అంతా అందరికీ పంచుతాను అని చెప్తుంది. వాళ్ల నాన్న మరోసారి ఆలోచించు బేబీ అని చెబితే బెదిరిస్తుంది. తర్వాత కావ్యకు రాజ్ ఫోన్ చేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!