Prema Entha Madhuram  Serial Today Episode:  అకిని శంకర్‌ కాపాడాడు అని తెలిసి రాకేష్‌ ఇరిటేట్ అవుతాడు. కోపంగా పని మనిషిని తిడతాడు. నిన్ను పనిలోంచి తీసేస్తే నేనేం చేయాలి ఇంకో ఇల్లు చూసుకో అంటాడు. శంకర్‌ నీ కుటుంబానికి ఏ కష్టం కలగకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నావు. కానీ రేపు జరిగే పెళ్లిళ్లను నువ్వు అసలు ఆపలేవు ఆ పెళ్లితో నువ్వు నీ తమ్ముళ్లు పిచ్చోళ్లు కావడం ఖాయం అనుకుంటాడు. ఇంతలో రూంలోంచి వాళ్ల తాతయ్య పాట పాడటం విని రాకేష్‌ షాక్‌ అవుతాడు. మరో రూంలో ఇంటి ఓనరు పాట పాడుతూ డాన్స్‌ చేయడం చూసి ఏమైంది వీళ్లిద్దరికీ అనుకుంటాడు. సైలెంట్‌ గా ఫాలో అయి విషయం తెలుసుకోవాలనుకుంటాడు. తాతయ్య డోర్ తెరచి చూస్తాడు.

Continues below advertisement


తాతయ్య: హమ్మయ్యా ఆ పగ పిచ్చోడు ఇంట్లో లేడు. ఆ శాడిస్టు గాడు వచ్చే లోపు నేను నా స్మిత దగ్గరకు వెళ్లిపోవాలి


అనుకుంటూ వెళ్లిపోతాడు.


రాకేష్‌: అసలు ఈ ముసలోడికి ఏమైంది ఎందుకు ఇలా రంకెలు వేస్తున్నాడు.


ఓనరు: హమ్మయ్యా ఆ మెంటల్‌ రాకేష్‌ గాడు ఇంట్లో లేడన్న మాట. వాడు వచ్చే లోపు నేను నా శీలా దగ్గరకు వెళ్లిపోవాలి.


రాకేష్‌: ఈ ఓనరు గాడికి నా చేతిలో చావే ఈరోజు చెప్తా  


అనుకుంటూ రాకేష్‌ కోపంగా వెళ్లిపోతాడు. మరోవైపు శంకర్‌, యాదగిరి ఒక దగ్గర వెయిట్‌ చేస్తుంటారు.


యాదగిరి: సార్‌ అవతల శర్మ ఓనరు బయలుదేరి పోయి ఉంటారు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు.


శంకర్‌: ఒక పవర్‌ఫుల్ ఎస్సైని రంగంలోకి దించబోతున్నాను బాబాయ్‌.


యాదగిరి: ఎవరు సార్‌ ఆ ఎస్సై..


శంకర్‌: ది లేడీ బాస్‌ ఝాన్సీ


ఝాన్సీ: నమస్తే శంకర్‌ ఎలా ఉన్నావు..


శంకర్‌: నమస్తే మేడం..మీకు తెలియనిది ఏముంది మేడం..


ఝాన్సీ: అవునులే మంచోడివి నలుగురికి మంచి చేసేవాడివి బాగుంటావు.


శంకర్‌: మీ అభిమానం మేడం..


ఝాన్సీ: అవును కానీ అర్జెంట్‌ గా కలవాలన్నావు ఏంటి విషయం. ఏదైనా ప్రాబ్లమా..?


శంకర్‌: ప్రాబ్లమ్‌ అంటే మీ దాకా తీసుకొచ్చేంత ప్రాబ్లమ్‌ కాదనుకోండి. నేనే గట్టిగా ఇచ్చే వాణ్ని. కాకపోతే లా అండ్‌ ఆర్డర్‌ చేతితో లాటీతో నాలుగు దెబ్బలు ఇస్తే కాస్త లైన్‌ లోకి వస్తారని మీకు కాల్ కొట్టాను.


ఝాన్సీ: నువ్వు కోటింగ్‌ ఇవ్వాలని డిసైడ్‌ అయ్యావంటే అవతలి వాళ్లను మొత్తం చదివేసి ఉంటావు. అసలు ఏం జరిగిందో చెప్పు.. ఏం చేయాలో నేను చెప్తా..?


అని అడగ్గానే జరిగిన స్టోరీ మొత్తం చెప్తాఉ శంకర్‌. అంతా విన్న ఝాన్సీ విషయం మొత్తం నాకు అర్థం అయింది.  ఈ ఝాన్సీ చేతికి చిక్కారో వాళ్లకు వర్ధంతే.. ఒక చిన్న కాల్ చేయ్‌ నేను వచ్చి అంతా చూసుకుంటాను అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు ముసలోళ్లను ఫాలో అయిన రాకేష్‌ వాళ్లు మిస్‌ కావడంతో ఇరిటేటింగ్‌ గా ఫీలవుతాడు. ఇంతలో రాకేష్‌కు శంకర్‌ ఫోన్‌ చేస్తాడు.


శంకర్‌: ఏం రాకేషు నీ దగ్గర సర్వీస్‌ అయిపోయిన రెండు బండ్లు టిప్‌టాప్‌ గా రెడీ అయి ఎటో పోతుంటే వాళ్లను ఫాలో చేస్తూ పోతున్నావా..?


రాకేష్‌: అంటే నా అనుమానం నిజమే అన్నమాట. వాళ్లను ట్రాప్‌ చేశావు కదూ


శంకర్‌: కాదు నిన్ను టార్గెట్‌ చేశాను. నీకు ఒక గట్టి షాక్‌ ఇచ్చి వదిలేద్దామనుకున్నాను. కానీ అకిని ప్రాణాలు తీయాలని చూశావు చూడు అది నాకు నచ్చలేదు. అందుకే నీకు గుణపాఠం చెప్పాలనుకుంటున్నాను.


రాకేష్‌: ఇవన్నీ చీఫ్‌ ట్రిక్స్‌ నన్ను ఏమీ చేయలేక మా వాళ్లను ట్రాప్‌ చేశావు కదూ


శంకర్‌: అయితే లోకేషన్‌ షేర్ చేస్తాను దమ్ముంటే నువ్వే మీ వాళ్లను ఆపుకో


అని లోకేషన్‌ షేర్‌ చేస్తాడు శంకర్‌. రాకేష్‌ కోపంగా చూస్తుంటాడు. మరోవైపు పెళ్లికి రెడీ అయిన గౌరిని నువ్వు అనురాధవి అని గుర్తుందా లేదా అని సంధ్య అడుగుతుంది. దీంతో శంకర్‌ వస్తాడని.. సమస్యలను సముద్రాన్నిదాటుకుని వచ్చి నా మెడలో తాళి కడతారు అని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


   


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!