Just In





Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today January 30th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీ దెబ్బకు ఊచలు లెక్కపెడుతున్న నర్శింహ.. ఈ సారి టార్గెట్ మిత్ర!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ నర్శింహని పోలీసులకు పట్టివ్వడం మిత్రకు మరో గండం ఉందని దీక్షితులు గారు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ అనుమానంతో వివేక్ వాళ్లని వెనక్కి వచ్చేయమని అంటుంది. నర్శింహ చూసి కారు వెనక్కి వచ్చేసింది.. రెండు కార్లు ఒకేసారి వెళ్తాయి ఫ్యామిలీ మొత్తం అయిపోతుందని లాయర్‌తో చెప్తాడు. ఇక వివేక్ వాళ్లు వచ్చి ఏమైందని అడిగితే లక్ష్మీ ఏం అడగొద్దని తమని ఫాలో అవ్వమని చెప్తుంది. లక్ష్మీ వాళ్ల కారు ముందు వెళ్తుంది. వెనక వివేక్ ఫాలో అవుతాడు.
నర్శింహ చూసి కౌంట్ డౌన్ మొదలు పెడతాడు. 5, 4, 3, 2,1 అనగానే కారు ముందు ఆపించేస్తుంది. కిందకి దిగి అనుమానంగా చూస్తుంది. అక్క బాంబ్ పాతి పెట్టడం గమనిస్తుంది. లక్ష్మీ పోలీసులకు ఫోన్ చేసి బాంబ్ పెల్చేడానికి రెడీగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. మిత్ర కిందకి దిగి ఏమైందని అడుగుతాడు. ఇక నర్శింహని కూడా పోలీసులు పట్టుకుంటారు. అందరూ కిందకి దిగి ఏమైందని అడిగితే నర్శింహ బాంబ్ పెట్టాడని లక్ష్మీ చెప్తాడు. నర్శింహ లక్ష్మీ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేయిస్తావా నీ అంతు చూస్తా మీ తాత కూడా నా దగ్గరే ఉన్నాడని చంపేస్తానని అంటాడు. దానికి మిత్ర ఓరేయ్ తాతని ఎప్పుడో కాపాడేశామని అంటాడు.
మరోవైపు జయదేవ్ దీక్షితులు గారి దగ్గరకు వెళ్లి మిత్ర కారుకి యాక్సిడెంట్ అయినట్లు కల వచ్చిందని మిత్ర జాతకం ఒక సారి చూసి గండాలు ఉన్నాయేమో చూడమని అంటాడు. దీక్షితులు గారు చూసి మిత్రకు మరో గండం ఉందని అంటాడు. మిత్ర ఇంట్లోనే ఉన్నాడు కదా అంటే లేడు కోడలి ఊరు వెళ్లాడని చెప్తాడు. మిత్రని వెంటనే ఇంటికి రమ్మని చెప్పమని మిత్రకు బయటే గండం ఉందని అంటాడు. ఇంతలో మిత్ర కాల్ చేసి తాతగారి ఊరిలోనే ఉన్నామని అంటాడు. జయదేవ్ మిత్రతో అక్కడ అనుకోని సంఘటనలు ఏమైనా జరిగాయా అంటే మిత్ర మొత్తం చేప్తాడు. ఇక రేపు బయల్దేరుతామని అంటాడు. దీక్షితులు వీలైనంత త్వరగా వాళ్లని తీసుకొచ్చేయమని అంటాడు. నర్శింహ, లాయర్ ఇద్దరూ జైలులోనే ఉంటారు. రౌడీలు వచ్చి బెయిల్ రద్దు అయిందని, ఫ్యాక్టరీ లైసెన్స్ కూడా రద్దు అయిపోయిందని అంటారు. ఈ సారి మిత్రని చంపేయాలని లక్ష్మీ జీవితాంతం విధవలా మిగిలిపోవాలని తన రౌడీలకు పురమాయిస్తాడు.
లక్ష్మీ పూజ చేయడానికి వస్తుంది. కానీ నుదిటిన బొట్టు పెట్టుకోదు. బొట్టు పెట్టుకోకుండా పూజ చేస్తున్నానని అనుకుంటుంది. ఇంతలో కుంకుమ కింద పడిపోబోతే మిత్ర పట్టుకుంటాడు. లక్ష్మీ దాన్ని అపశకునమేమో అనుకుంటుంది. నేను పట్టుకున్నాను కదా ఏం కాదని మిత్ర చెప్పి లక్ష్మీ నుదిటిన బొట్టు పెడతాడు. లక్ష్మీ, మిత్ర ఇద్దరూ దేవుడికి దండం పెట్టుకుంటారు. లక్ష్మీ ఆందోళనగానే ఉంటుంది. లక్ష్మీ జయదేవ్‌కి కాల్ చేసి దీక్షితులు గారిని కలవమని చెప్తుంది. కంగారుగా ఉందని చెప్తుంది. దాంతో జయదేవ్ ఇప్పటికే వెళ్లి వచ్చానని నేను మీ ఊరు వస్తున్నా వచ్చాక చెప్తానని అంటాడు. లక్ష్మీ టెన్షన్ పడుతుంది. ఇక వివేక్ పేపర్ తీసుకొని జాను దగ్గరకు వచ్చి నీ గురించి, మీ అక్క గురించి పేపర్లో రాశారని చెప్తాడు. తనలో ఈక్వల్‌గా పోటీ చేయడం బట్టే నాకు గుర్తింపు వచ్చిందని లేదంటే వెనకే ఉండిపోయే దాన్ని అని అంటుంది. దాంతో వివేక్ జాను వదిన నిన్ను ఎప్పుడైనా ఆఫీస్‌కి రావొద్దు అని చెప్పిందా అని అడుగుతాడు. దాంతో లక్ష్మీ గతంలో జానుకి ఆఫీస్‌కి రమ్మని చెప్పిన విషయం గుర్తు చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.