Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ దీపకి ధైర్యం చెప్తాడు. ఇక దశరథ్ ఏడుస్తున్న తన భార్యని ఓదార్చుతాడు. దీపతో మాట్లాడమని చెప్తాడు. జ్యోత్స్న అబద్ధం చెప్పిందేమో ఒకసారి దీపకి కాల్ చేయ్ అంటే సుమిత్ర దీపకి కాల్ చేస్తుంది. దీప దగ్గర ఫోన్ లేకపోవడంతో దీప లిఫ్ట్ చేయదు. ఇక కాంచనకు కాల్ చేస్తుంది. తర్వాత కార్తీక్‌కి కాల్ చేస్తే కార్తీక్ కూడా లిఫ్ట్ చేయడు. జరిగిన దానికి వాళ్లు బాధ పడ్డారని దశరథ్ అంటాడు. 


మరోవైపు అనసూయ ఇళ్లు అమ్మడానికి బేరం తీసుకొస్తుంది. కాళ్లావేళ్లా పడినా డబ్బు వెంటనే ఇవ్వనని అంటారు. ఇళ్లు వద్దని వెళ్లిపోతాడు. ఇక దీప పాపకి పాలు బ్రెడ్ తినిపిస్తుంటుంది. డబ్బు గురించి దీప ఆలోచిస్తూ ఉంటే శౌర్య ఇద్దరు నానమ్మలు వస్తారా అని అడుగుతుంది. వస్తారని దీప చెప్తుంది. ఇక దీప పాపని పడుకోబెట్టి బయటకు వెళ్తుంది. ఇంతలో కార్తీక్ దగ్గరకు డాక్టర్ వచ్చి కోప్పడతాడు. ఇంకా డబ్బు కట్టలేదని రేపే ఆపరేషన్ అని మీరు నాకు తెలిసిన వాళ్లు కాబట్టి నేను ట్రీట్మెంట్ చేస్తున్నా రేపు పది లోపు డబ్బు కట్టకపోతే ఆపరేషన్ అవ్వదని అంటాడు. కార్తీక్ డాక్టర్‌ని బతిమాలుతాడు. దీప అడిగితే కార్తీక్ డబ్బు వస్తుందని చెప్తాడు. దాంతో దీప డాక్టర్‌తో అబద్ధం చెప్పినట్లు నాతో చెప్తున్నారా అని అంటే నా దగ్గర అబద్ధాలు తప్ప డబ్బు లేదని అంటాడు. కాశీ తిరుగుతున్నాడని, అనసూయ ఇళ్లు అమ్మడానికి వెళ్లిందని అంటాడు. పాపకి ఏం కాదని నేను కాపాడుతానని అంటాడు. దీప చాలా ఏడుస్తుంది. మనసులో ఏదో భయం ఉందని ఏదో ఒక ప్రయత్నం చేయాలని అనుకుంటుంది. 


ఇక అనసూయ ఇంటికి వస్తుంది. కాంచన ఏమైంది అక్క అని అడుగుతుంది. ఖాళీ చేతులతోనే వచ్చానని ఏడుస్తుంది. కాంచన ఏడుస్తుంది. హాస్పిటల్‌కి వెళ్దామని అనసూయ అంటే డబ్బు లేక ఏడుస్తున్న కొడుకు కోడలిని చూడాలా. చావు బతుకులతో పోరాడుతున్న మనవరాలిని చూడాలా.. నా తండ్రి కోటీశ్వరుడు కానీ నాకు సాయం చేయడం లేదని ఏడుస్తుంది. శౌర్యకి ఏమైనా అయితే మన బతుకులకు అర్థమే లేదని ఏడుస్తుంది. అనసూయ కూడా ఏడుస్తుంది. దీప దేవుడి దగ్గరకు వస్తుంది. చిన్న తనం నుంచి ఎంతో బాధ పడుతున్నానని ఈ సారి చాలా పెద్ద కష్టం వచ్చిందని  ఈసారి కోల్పోవడానికి తన కూతురి ప్రాణం తప్ప ఇంకేం లేదని ఏడుస్తుంది. ఇంతలో జ్యోత్స్న దీప దగ్గరకు వస్తుంది.


జ్యోత్స్న: దేవుడు నిన్ను కరుణించాడు దీప. నీకు సాయం చేయమని నన్ను పంపాడు. ఏంటి అలా చూస్తున్నావ్ ఇంటి కొచ్చి కూతురి గురించి చెప్పాను కదా మళ్లీ అలాంటిదే చెప్పాలి అనుకుంటున్నా అనుకున్నావా. లేదు దీప నేను మనిషినే కదా ప్రాణం విలువ నాకు తెలుసు. డబ్బు మా బావ కట్టగలడా అంతే అతన్ని నువ్వు పేదవాడిని చేసేశావ్. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నీ కూతురి ప్రాణాలు కాపాడటానికి వచ్చాను ఏంటి నమ్మకం కుదరడం లేదా. చెక్ ఇచ్చి దీన్ని ఎక్కడో చూసినట్లు ఉంది కదా. ఇది అది కాదు. 



దీప: మళ్లీ నా అవసరంతో ఆడుకోవాలి అనుకుంటున్నావా. నిన్ను సుమిత్రమ్మ గారు పంపారా.
జ్యోత్స్న: అయ్యో అమాయకురాలా వాళ్లకి అసలు నీ కూతురి అనారోగ్యం గురించి తెలిస్తే కదా నీ కూతురి అనారోగ్యం అంతా నాటకం అని నేను వాళ్లని నమ్మించాను. లేదంటే ఈ పాటికి మా మమ్మీనో డాడీనో నీ కోసం డబ్బు తీసుకొచ్చే వాళ్లు. ఆపరేషన్ రేపే కదా. ఇప్పుడు ఆపరేషన్ జరగాలి అంటే రాత్రికి రాత్రి నీకు ఎవరూ డబ్బు ఇవ్వరు. నీకు నేను కోటి రూపాయల చెక్ ఇస్తున్నా. సగం ఆపరేషన్‌కి పోయినా మిగిలిన సగం డబ్బుతో నువ్వు నీ పాప హ్యాపీగా బతికేయొచ్చు. తీసుకో దీప. నేను నీకు డబ్బు ఇచ్చా కదా తిరిగి నువ్వు నాకు ఒక రూపాయి కట్టొద్దు. కానీ ఒక్క సంతకం చేస్తే చాలు. 
దీప: ఏంటి ఇది.
జ్యోత్స్న: నీ కూతురి ప్రాణం ఖరీదు 50 లక్షలు మిగతా 50 లక్షలు నేను నీ మంగళ సూత్రానికి నేను ఖరీదు కట్టాను. నీకు నీ ప్రాణం అయితే నీ మెడలో తాళి కట్టిన బావ నాకు ప్రాణం అందుకే నేను రెండు ప్రాణాలకు ఒకే ఖరీదు కట్టాను. ఇందులో నీకు బావకి సంబంధం లేదని రాశాను. నువ్వు సంతకం పెట్టేసి డబ్బు తీసుకొని వెళ్లిపో. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కూతురి పరిస్థితికి కుమిలి కుమిలి ఏడుస్తున్న దీప.. జ్యోత్స్న బుద్ధి ఇంత దారుణమా!