Ennallo Vechina Hrudayam Serial Today Episode త్రిపుర బాల కోసం పసరు మందు తీసుకొచ్చే సరికి బాల అక్కడుండదు. త్రిపుర మొత్తం వెతుకుతుంది. ఇంతలో బాల సుందరి సుందరి అని బాల కోతిలా రాళ్ల గుట్టల మీద గంతులేస్తాడు. త్రిపుర బాలని పిలిచి ఆకు పసరు రాస్తే మీ దెబ్బలు తగ్గిపోతాయని దెబ్బల మీద పసురు వేస్తుంది. బాల నొప్పి అని అంటే కాసేపటికి నొప్పి తగ్గిపోతుందని అంటుంది. బాల మందు పెట్టించుకుంటాడు. తర్వాత ఇద్దరూ బయల్దేరుతారు. 


త్రిపుర: నీ పేరేంటి?
బాల: నా పేరా అనంత్ నన్ను అన్నయ్యా అంటాడు. అమ్మ నాన్న అంటుంది. బామ్మ కన్నయ్యా అంటుంది. ఇలా చాలా పేర్లు ఉన్నాయి.
త్రిపుర: అది కాదు అందరూ కలిసి ఏమని పిలుస్తారు.
బాల: ఏమో నాకు తెలీదు.
త్రిపుర: మీది ఏ ఊరు.
బాల: మాది సిటీ.
త్రిపుర: అదే దాని పేరు.
బాల: ఏమో నాకు తెలీదు.
త్రిపుర: మీ ఇళ్లు ఎక్కడ.
బాల: ఇలా చాలా దూరం వెళ్లాలి. అక్కడ చెట్ల మధ్యలో ఉంటుంది. తెల్ల రంగు పెయింట్ వేసుంటారు. మా ఇంటికి రోడ్డు కూడా ఉంటుంది. 
త్రిపుర: పాపం ఈయన బిహేవియర్లో ఏదో తేడాగా ఉంది చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నారు.


అనంత్, తన తండ్రి బాల కోసం వెతుకుతూ ఉంటారు. బాల కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయని ఏమైనా తినడానికి పెట్టు అంటాడు. దాంతో త్రిపుర ఈ అడవిలో ఏముంటాయి అనుకుంటూ ఫ్రూట్స్ తీసుకొస్తా అని చెప్పి వెళ్లి జామ పళ్లు తీసుకొని వస్తుంది. ఇవి నాకు చాలా ఇష్టమని బాల తింటాడు. బాల పరుగులు తీస్తుంటే త్రిపుర ఆపి ఇది అడవి కదా ఇక్కడ క్రూర మృగాలు ఉంటాయి మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. మరోవైపు కొందరు రౌడీలు త్రిపుర, బాలకి ఎదురెళ్తారు. వీరేనా క్రూరమృగాలు అని బాల అంటే త్రిపుర బాల చేయి పట్టుకొని పరుగులు తీస్తుంది. అయినా వాళ్లు బాల, త్రిపురల్ని చుట్టు ముడతారు. బాలని చెట్టుకు కట్టేస్తారు. త్రిపురని లాక్కెత్తారు. త్రిపురని కొట్టడంతో కళ్లు తిరిగి పడిపోతుంది. ఇక బాల దగ్గరకు ఓ సీతాకోక చిలుక వచ్చి వాలుతుంది. దాన్ని చూడగానే బాలకి యాక్సిడెంట్ గుర్తొచ్చి ఆవేశంతో కట్లు తెంచుకుంటాడు. తర్వాత ఓ కర్ర తీసుకొని రౌడీలను చితక్కొడతాడు. ఇంతలో అనంత్, అతని తండ్రి వచ్చి బాలని పట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు. 


బాల లేచి సుందరి ఎక్కడ సుందరి ఎక్కడా అని మొత్తం ఇళ్లంతా వెతుకుతాడు. సుందరి ఎవరు అని అందరూ అడితే జరిగిదంతా చెప్తాడు. తనని కాపాడిందని చెప్తాడు. సుందరి కావాలి సుందరి కావాలి అని అడుగుతాడు. చిన్న పిల్లాడిలా అలిగిపోతాడు. ఇక త్రిపుర మీద సీతాకోక చిలుక వాలడంతో త్రిపుర లేస్తుంది. బాల గురించి వెతుకుతుంది. ఇక రాత్రి త్రిపుర పుస్తకం చదువుతుంటే గాయత్రీ వచ్చి కళ్లు మూసి అక్కకి లాప్ టాప్ చూపిస్తుంది. ఆఫర్‌లో కొన్నానని చెప్తుంది. శాలరీ అడ్వాన్స్ తీసుకొని ఈఎమ్‌ఐలో కొన్నానని అంటుంది. దానికి ఊర్వశి ల్యాప్‌టాప్‌లో పని చేసుకోవచ్చు కదా అని అంటే దానికి ల్యాప్ టాప్ అడిగితే దాని పనులు అన్నీ చేయించుకుంటుందని అంటుంది.


ఇంతలో ఊర్వశి వచ్చి ల్యాప్‌టాప్ లాక్కుంటుంది. గాయత్రీ ఎంత అడిగినా ఊర్వశి ఇవ్వదు. ఇంతలో త్రిపుర పిన్ని వచ్చి మీ ముగ్గురిని నా కూతుళ్లు అనుకున్నా మీరు ల్యాప్‌టాప్ కోసం పరాయివాళ్లని చేస్తారా అని అంటుంది. దాంతో గాయత్రీ అక్కతో ఇంటి పనులు నాతో బయటపనులు చేయిస్తావ్ మా జీతాలు తీసుకుంటావ్  అని అరుస్తుంది. ఇక రమాప్రభ కూతురి దగ్గర ల్యాప్‌టాప్ తీసుకొని గాయత్రీకి ఇచ్చేస్తుంది. మీరు డబ్బులు ఇవ్వకపోతే మేం బతకలేం అంటే కదా అని అడుగుతుంది. ఇక త్రిపుర, వాళ్ల తాతయ్య ఊర్వశికి ల్యాప్‌టాప్ ఇచ్చేయమని గాయత్రీతో చెప్తారు. గాయత్రీ కోపంతో ఇచ్చేసి వెళ్లిపోతుంది. గాయత్రీ అక్క, తాతలతో మనం విడిగా వెళ్లిపోదామని అంటుంది. తాతయ్య గాయత్రీకి సర్ది చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కూతురి పరిస్థితికి కుమిలి కుమిలి ఏడుస్తున్న దీప.. జ్యోత్స్న బుద్ధి ఇంత దారుణమా!