సినిమా ప్రపంచంలోకి ఎన్నో కలలు, ఆశలతో అడుగు పెడుతుంటారు హీరోలు హీరోయిన్లు. అయితే మొదట్లో ప్రతి ఒక్కరూ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు వచ్చిన అవకాశాలు చేయి జారిపోతే, మరికొన్నిసార్లు చేసిన పనికి రెమ్యూనరేషన్ కూడా సరైన విధంగా ఉండదు. గుర్తింపు వచ్చేదాకా ఇలాంటి కష్టాలు నటీనటులకు తప్పవు. ఒక్కసారి స్టార్ డమ్ వస్తే మాత్రం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు మొదటి సినిమాకు కేవలం రూ. 10 ఫస్ట్ రెమ్యూనరేషన్ గా తీసుకుందన్న విషయం తెలుసా మీకు ? ఆ తర్వాత మాత్రం ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా మారి, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరిగా తన పేరును సినీ చరిత్రలో లిఖించుకుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు సీనియర్ నటి జయప్రద.


ఫస్ట్ మూవీకి రూ. 10 పారితోషికం 
చిన్న వయసులోనే సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన అలనాటి హీరోయిన్ జయప్రద. ఆ తర్వాత కాలంలో అగ్రనటిగా ఎదిగి, సౌత్ లో, నార్త్ లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఎలాంటి పాత్ర చేసినా సరే... అందులో పూర్తిగా లీనమైపోవడం అనేది జయప్రద ప్రత్యేకత అని చెప్పుకోవాలి. అందుకే ఆమెకు అలనాటి కాలం నుంచే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సిరిసిరి మువ్వ, సాగర సంగమం వంటి ఫ్యామిలీ సినిమాలతో పాటు జయప్రద 'ఊరికి మొనగాడు' వంటి సినిమాల్లో గ్లామర్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటించి అన్ని వర్గాల ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ చిత్ర సీమలో కూడా జయప్రద టాప్ స్టార్స్ తో నటించింది. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర వంటి హిందీ బదా స్టార్స్ తో ఆమె హిందీలో పలు సినిమాల్లో ఆడిపాడింది.


ఇక కెరీర్ మొదటి పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 300 సినిమాల్లో నటించిన జయప్రద తన మొదటి సినిమాకి మాత్రం ఊహించని విధంగా అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది. నిజానికి జయప్రద 13 ఏళ్ల వయసున్నప్పుడు తన సినీ కెరియర్ ను ప్రారంభించింది. ఆమె 1974లో 'భూమి' అనే సినిమాలో ఫస్ట్ టైం వెండితెరపై మెరిసింది. ఈ తెలుగు మూవీలో నటించినందుకు గానూ అప్పట్లో జయప్రద పారితోషకంగా రూ.10 అందుకున్నట్టు సమాచారం. కానీ ఈ చిన్న పాత్ర ఆమె కెరీర్‌ ను కీలక మలుపు తిప్పింది. వరుస అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే అదృష్టం ఆమె తలుపు తట్టింది. ఇంకేముంది ఫలితంగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషకం అందుకునే హీరోయిన్లలో తాను కూడా ఒకరిగా చేరిపోయింది. 


Also Read: 'గేమ్‌ ఛేంజర్‌' ఫలితంపై అంజలి ఫస్ట్‌ రియాక్షన్‌... ఆ విషయంలో చాలా సంతృప్తిగా ఉంది, కానీ


కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి.. 


జయప్రద డాన్స్ అంటే పడి చచ్చేవాళ్ళు ఇప్పటికి ఉన్నారు. అయితే జయప్రద దాదాపు 8 భాషల్లోని సినిమాల్లో నటించిన విషయం ఇప్పటికీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అప్పట్లోనే ఏకంగా 8 సినిమాలలో నటించిన అరుదైన రికార్డును క్రియేట్ చేసిందంటే జయప్రదకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమా ఇండస్ట్రీని తిరుగులేని హీరోయిన్ గా ఏలిన తర్వాత జయప్రద కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెట్టి, అక్కడ కూడా తనదైన ముద్రవేశారు. తన కెరీర్‌లో ఉన్నత దశలో ఉన్న సమయంలో, జయప్రద వెండితెరకు దూరంగా ఉండాలని ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. 1994లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. 2019లో ఆమె భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.


Read Alsoఫైనల్‌గా రిలేషన్షిప్‌లో ఉన్నట్టు ఒప్పుకున్న రష్మిక... విజయ్ దేవరకొండతో ఆ ఒక్కటి మాత్రం సస్పెన్స్