Anjali Comments on Game Changer Result: తెలుగమ్మాయి అంజలి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల 'గేమ్‌ ఛేంజర్‌'తో ఫ్యాన్స్‌ని అలరిచిన ఆమె తాజాగా ఈ సినిమా ఫలితంపై తొలిసారి స్పందించింది. కాగా ఈ సంక్రాంతికి ఆమె రెండు సినిమాలు థియేటర్‌లో అలరించారు. ఒకటి 'గేమ్‌ ఛేంజర్‌' కాగా మరోకటి 'మదగజరాజ'. తమిళంలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం రూ. 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. జనవరి 31న తెలుగులో ఈ సినిమా రిలీజ్‌ కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్లు వరలక్ష్మి శరత్‌కుమార్‌, అంజలిలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు 'గేమ్‌ ఛేంజర్‌'పై ప్రశ్న ఎదురైంది. 


అందుకే ప్రమోషన్స్‌కి వెళతాము


'ఈ సంక్రాంతికి మీకు చాలా స్పెషల్‌..  మీ రెండు సినిమాలు విడుదలయ్యాయి. తమిళంలో మదమగరాజ మంచి హిట్‌ అయ్యింది. ఇక్కడ కూడా అలాంటి రిజల్ట్‌ వచ్చుంటే బాగుండేది కదా. ఎందుకంటే ఈ సినిమాకు కోసం మీరు చాలా కష్టపడ్డారు. మరి గేమ్‌ ఛేంజర్‌ ఫలితంపై మీ అభిప్రాయం ఏంటి?' ఓ విలేఖరి అడిగారు. దీనికి ఆమె స్పందిస్తూ... ''నటిగా వందశాతం ఎఫర్ట్‌ ఇవ్వడం నా బాధ్యత. నన్ను నమ్మి ఒక పాత్రను డిజైన్‌ చేసినప్పడు. వందశాతం ఎఫర్ట్స్‌ పెడుతున్నానా? లేదా? అనేదే నా చేతిలో ఉంటుంది. ఒక నటిగా నా బాధ్యత అంతవరకే ఉంటుంది. అక్కడితో నా పనైపోతుంది. కానీ, సినిమాను అడించాలనే తపన కూడా ఉంటుంది. అందుకే ప్రమోషన్స్‌కి వెళ్తుంటాము, మా సినిమా చూడమని చెబుతాం" అని చెప్పుకొచ్చింది. 


Also Read'దిల్' రాజుకు రామ్ చరణ్ మరో సినిమానా? సారీ... ప్రజెంట్ కమిట్మెంట్ ఏదీ లేదు


అక్కడితో నా బాధ్యత అయిపోతుంది


ఇప్పుడు గేమ్‌ ఛేంజర్‌ గురించి మాట్లాడాలంటే సపరేట్‌ ఇంటర్య్వూ పెట్టాలి. ఎందుకనేది మీ అందరికి తెలుసు. కొన్ని సినిమాలను మనం పర్సనల్‌ నమ్మి నటిస్తాము. ఈ సినిమాను నమ్మి నేను రెండు వందల శాతం ఎఫర్ట్స్‌ పెట్టాను. అయినా ఈ సినిమా చూసిన జనరల్‌ ఆడియన్స్‌ అంతా సినిమా బాగుందన్నారు. మంచి సినిమా చేశారు, మీరు చాలా బాగా నటించారని చెప్పారు. సినిమా బాగుంటం వేరు, మంచి సినిమా వేరు. గేమ్‌ ఛేంజర్‌ మంచి సినిమా.. ఇందులో మీరు చాలా బాగా నటించారని ప్రశంసిస్తున్నారు. కాబట్టి నేను ఈ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నా. కానీ, కొంతగా బాధగా కూడా అనిపిస్తుంది. దీని గురించి మాట్లాడాలంటే సపరేట్‌ ఇంటర్య్వూ పెట్టాలి" అని సమాధానం ఇచ్చింది. కాగా శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జనవరి 10న థియేటర్లోకి వచ్చింది. రామ్‌ చరణ్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా అంజలి కీలక పాత్ర పోషించింది. ఇందులో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. 


Also Read: ఫైనల్‌గా రిలేషన్షిప్‌లో ఉన్నట్టు ఒప్పుకున్న రష్మిక... విజయ్ దేవరకొండతో ఆ ఒక్కటి మాత్రం సస్పెన్స్