Just In





Coffee With A Killer OTT Release Date: 'కాఫీ విత్ ఏ కిల్లర్'... తొమ్మిదేళ్ల తర్వాత ఆర్పీ డైరెక్షన్... డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Coffee with a Killer OTT Release Date : ఆర్పి పట్నాయక్ దర్శకత్వం వహించిన కామెడీ థ్రిల్లర్ మూవీ 'కాఫీ విత్ ఎ కిల్లర్' డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు కామెడీ థ్రిల్లర్ ఈ వారం స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. టాలీవుడ్ లోని పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన ఆర్పి పట్నాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరు ''కాఫీ విత్ ఎ కిల్లర్'. టైటిల్ వినగానే ఏదో థ్రిల్లర్ మూవీలా అనిపించినప్పటికీ, ఇదొక కామెడీ ఎంటర్టైనర్. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన చాలాకాలం తర్వాత ఈ సినిమా ఓటీటీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
'కాఫీ విత్ ఎ కిల్లర్' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన 'కాఫీ విత్ ఎ కిల్లర్' మూవీ 2022లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. అదే ఏడాది ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. కానీ అసలు ఈ మూవీ విషయం సినీ జనాలకు మర్చిపోయారు. మరోసారి ఆహా వీడియో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో, థియేటర్లలో రిలీజ్ అయిన రెండేళ్ల తరువాత 'కాఫీ విత్ ఎ కిల్లర్' మూవీ అందరి దృష్టిలో పడింది.
ఆహా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఎక్స్ వేదికగా వెల్లడించింది. "ఒక కాఫీ షాప్... అందులో అంతులేని ట్విస్టులతో జాతకాల నుంచి క్రైమ్ సీన్ల వరకు... 'కాఫీ విత్ ఎ కిల్లర్'తో బెస్ట్ థ్రిల్లింగ్ రైడ్ ను ఎంజాయ్ చేయండి. జనవరి 31 నుంచి 'కాఫీ విత్ ఎ కిల్లర్' మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది" అనే క్యాప్షన్ తో మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో ఒక వ్యక్తి మొహాన్ని సస్పెన్స్ లో ఉంచి... ఒక చేతిలో కాఫీ కప్పు, మరో చేతిలో గన్ను పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇక ఈ మూవీలో ప్రముఖ కమెడియన్లు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, రఘు బాబు, రవిబాబు వంటి వాళ్ళు లీడ్ రోల్స్ పోషించారు. సెవెన్ హిల్స్ సతీష్ ఈ మూవీని నిర్మించగా, 'కాఫీ విత్ ఎ కిల్లర్' మూవీకి దర్శకత్వం వహించిన ఆర్పి పట్నాయక్ సంగీతం కూడా అందించారు. నిజానికి ఆర్పి పట్నాయక్ దర్శకత్వంలో వచ్చిన ఫస్ట్ మూవీ ఇదే కాదు. గతంలో ఆయన అందమైన మనసులో, ఫ్రెండ్స్ బుక్, బ్రోకర్, మనలో ఒకడు, తులసి దళం వంటి సినిమాలను కూడా తెరకెక్కించారు.
'కాఫీ విత్ ఎ కిల్లర్' స్టోరీ ఇదే
'కాఫీ విత్ ఎ కిల్లర్' సినిమా మొత్తం ఒక కాఫీ షాప్ చుట్టూ తిరుగుతుంది. ఆ కాఫీ షాప్ లో సినిమా తీయాలని కలలు కనే ఒక బ్యాచ్ తో పాటు జాతకాల పిచ్చి ఉన్న మరి కొంతమంది ఉంటారు. అలాగే డేట్ కోసం వచ్చిన ఒక కపుల్, పోలీస్ ఆఫీసర్, అందరూ కమెడియన్ గా భావించే ఓ కిల్లర్ ఉంటారు. సినిమాలో వీళ్లే కీలక పాత్రధారులు. మరి ఈ కాఫీ షాప్ లో ఏ స్టోరీ ఎటు టర్న్ అవుతుంది? చివరికి ఏమవుతుంది ? అనేది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. 'కాఫీ విత్ ఎ కిల్లర్' రిలీజ్ తో ఈ వీకెండ్ టాలీవుడ్ ఓటీటీ లవర్స్ కి మంచి ఇంట్రెస్టింగ్ సినిమా అందుబాటులోకి రాబోతోంది.