Pushpa 2 Locks OTT Release Date : ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప 2 మూవీ బాక్సాఫీసును ఏలేస్తోంది. మూవీ విడుదలై రెండు నెలలు కావాస్తోంది. ఇంకా థియేటర్లో ఈ సినిమా జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు రూ. 1831కి పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా రికార్డుకు ఎక్కింది. ఇలా విడుదలైనప్పటి నుంచి రికార్డు మీద రికార్డులు కొల్లగొడుతున్న ఈ చిత్రం ప్రస్తుతం రీలోడెడ్‌ వెర్షన్‌తో థియేటర్‌లో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతుంది. అయితే సినిమా విడుదలైన రెండు నెలలు కావోస్తోంది. దీంతో ఈ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌ కోసం మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ సినిమాకు రీలోడెడ్‌ వెర్షన్‌ కూడా యాడ్‌ అవ్వడంతో ఓటీటీ రిలీజ్‌ కోసం ఆడియన్స్‌ క్యూరియసిటీగా ఉన్నారు.


ఆ రోజే ఓటీటీకి


తాజాగా వారందరికి గుడ్‌న్యూస్‌ అందించింది నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ని లాక్‌ చేసి తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది. దీంతో ఓటీటీ ప్రియులంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఈ సినిమా జనవరి 30వ తేదీన ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్‌. కాగా రిలీజ్‌కి ముందే పుష్ప 2 సినిమా ఓటీటీ రైట్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా భారీ ధరకు ఈ సినిమా ఓటీటీ డిల్‌ కుదిరిందని టాక్‌.  అన్ని భాషలకు కలిసి దాదాపు రూ. 100 కోట్లకు పుష్ప 2 హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఇక ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించడంతో పుష్ప 2 ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఆలస్యం అయినట్టు తెలుస్తోంది. ఇక ఒప్పందం ప్రకారం రెండు నెలలకు ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌కి ఇస్తుంది సదరు సంస్థ. 


ఆల్ రికార్డ్స్ బ్రేక్


క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన 'పుష్ప: ది రైజ్‌' 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు వరల్డ్‌ వైడ్‌గా మంచి రెస్పాన్స్‌ అందుకుంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ తన నటనతో దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్స్‌ బేస్‌ను సంపాదించుకున్నాడు. దీంతో పార్ట్‌ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా అభిమానులంతా ఈగర్‌గా వెయిట్‌ చేశారు. అయితే ఏడాదిలోనే సెకండ్‌ పార్ట్‌ని తీసుకువస్తానని చెప్పిన మూవీ టీం స్లో స్లోగా షూటింగ్‌ పూర్తి చేసి మూడేళ్లకు పుష్ప 2 రిలీజ్‌ చేసింది.  మూడేళ్లు ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫలితంగా అల్లు అర్జున్‌ తన మాస్‌ అవతారం చూపించాడు. 


అల్లు అర్జున్‌ ఇంటెన్సీవ్‌ యాక్షన్‌, డైలాగ్స్‌తో రప్పా రప్పా ఆడించాడు. విడుదలైన అన్ని ఏరియాల్లో ఈ చిత్రం మెగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ముఖ్యంగా నార్త్‌ బెల్ట్‌లో అన్ని రికార్డ్స్‌ని బ్రేక్‌ చేసి టాప్‌లో స్థానంలో నిలిచింది. బాలీవుడ్‌ ఖాన్‌ల చిత్రాల రికార్డ్స్‌ని సైతం బ్రేక్‌ చేసి ఓ డబ్బింగ్‌ సినిమాలో హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 నిలవడం విశేషం. కాగా విడుదల సమయంలో 'పుష్ప 2' నిడివి 3 గంటల 20 నిమిషాలు. ఇటీవల అదనంగా రీలోడెడ్‌ వెర్షన్‌ యాడ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం పుష్ప 2 నిడివి 3 గంటల 40 నిమిషాలకు చేరింది. థియేటర్లో ఈ రీలోడెడ్‌ వెర్షన్‌కి సైతం ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుండటం మరో విశేషం.