నెట్ ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఓటీటీలు ప్రతి వారం కొత్త కొత్త సినిమాలను అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ చేస్తూ, భాషతో సంబంధం లేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి నెలలో ఓటీటీ మూవీ లవర్స్ ని ఆలరించడానికి కొన్ని మోస్ట్ అవైటింగ్ సినిమాలు రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా పలు కన్నడ సినిమాలు థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుని, ఈ నెలలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధంఅవుతున్నాయి. ఈ లిస్టులో కన్నడ ఇండస్ట్రీ నుంచి గత ఏడాది చివర్లో తెరపైకి వచ్చిన 'మ్యాక్స్' నుంచి 'యూఐ' వరకు పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. 


యూఐ
ఉపేంద్ర హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ 'యూఐ'. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫ్యూచర్స్టిక్ మూవీనీ లహరి ఫిలిమ్స్ బ్యానర్ పై జి మనోహర్, కెపి శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మించారు. అజనీష్ లోక్నాథ్ సంగీతం సమకూర్చారు. ఈ మూవీ కన్నడతో పాటు హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయింది. థియేటర్లలో గత ఏడాది డిసెంబర్ 25న రిలీజైన 'యూఐ' మూవీ ఫిబ్రవరిలోనే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. పవర్, టెక్నాలజీ, నాలెడ్జ్ ను మిస్ యూజ్ చేస్తే ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది ? అనే పాయింట్ తో తెరకెక్కింది ఈ మూవీ. ఇందులో సత్య, కల్కి మధ్య జరిగే గొడవ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. 


మ్యాక్స్ 
విజయ్ కార్తికేయ దర్శకత్వంలో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మూవీ 'మ్యాక్స్'. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా సుదీప్ అభిమానులను బాగానే ఆకట్టుకుంది. సుదీప్ తో పాటు సుకృత వాగ్లే, వరలక్ష్మి శరత్ కుమార్, సంయుక్త హొర్నాడ్,  ఇళవరసు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ 2024 డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా సుదీప్ అదరగొట్టాడు. ఈ మూవీ కూడా ఫిబ్రవరిలోనే జీ5 ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది.


Also Read: రాచరికం రివ్యూ: సీఎం సీటుకు అక్క, తమ్ముడు చేసిన రక్తచరిత్ర - రాయలసీమ రాజకీయాలకు అద్దం పట్టేలా...


ఆరం అరవిందస్వామి 
అనీష్ తేజేశ్వర్, నీలనా నాగరాజ్, కృతిక శ్రీనివాసన్ లీడ్ రోల్స్ పోషించిన 'ఆరం అరవిందస్వామి' మూవీ 2024 నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ 'ఆరం అరవిందస్వామి' మూవీ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి నెలలో రిలీజ్ కాబోతోందని అంటున్నారు. దీనిపై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఓ రికవరీ ఏజెంట్ స్టోరీ ఇది. హీరో తన ప్రియురాలి కోరిక మేరకు పెళ్లి చేసుకోవాలా? లేదా ఒంటరిగా ఉండాలా అనే గందరగోళంలో ఉంటాడు. ఇలా పెళ్లి గురించి గందరగోళంలో పడడానికి రెండో కారణం అతను చేసే జాబ్. మరి హీరో ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడా? లేదా ? అనేది తెరపై చూడాలి.  


Read Also: Allu Arjun : ఓటీటీ నుంచి అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ అవుట్.. డిలీట్ చేయకముందే చూడండి