Unni Mukundan Marco Movie Locks OTT Release Date: మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మాలీవుడ్‌ స్టార్‌ హీరోగా గుర్తింపు పొందిన అతడు తెలుగు ఆడియన్స్‌కి కూడా సుపరిచితుడే. భాగమతి, జనతా గ్యారేజ్‌ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. అయితే గతేడాది అతడు మార్కో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సాధారణంగానే విలన్‌ రోల్స్‌తో భయపెట్టే ఉన్ని ఈసారి లీడ్ రోల్లో ఫుల్‌ వయోలెన్స్‌తో షాకిచ్చాడు. యాక్షన్‌, థ్రిల్లర్‌గా గతేడాది డిసెంబర్‌ 20న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం అంచనాలను మంచి విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ. 100 కోట్టు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది.  


కాగా ఉన్ని ముకుందన్‌ హీరోగా హనీఫ్ దర్శకత్వంలో మార్కో సినిమా తెరకెక్కింది. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండ 2024 డిసెంబర్‌ 20న థియేటర్‌లో విడుదలైంది. కేవలం మలయాళ భాషలోనే విడుదలైన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్‌ అందుకుంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌, థ్రిల్లర్‌గా అక్కడి ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఉన్ని ముకుందన్‌ ఇంటెన్సీవ్‌ యాక్టింగ్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. దీంతో మలయాళంలో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్‌ చేసింది. ఇక మాలీవుడ్‌లో ఈ సినిమా వస్తున్న రెస్పాన్స్‌ చూసి ఇతర భాషల్లోనూ రిలీజ్‌ చేశారు. 


తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడలోనూ మార్కో విడుదలైంది. ఈ ఏడాది జనవరి 1న తెలుగులో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాకు ఇక్కడ కూడా ఆడియన్స్‌ని మంచి స్పందన వచ్చింది. అంతేకాదు ఇతర భాషల్లోనూ ఈ సినిమాకు భారీ రెస్పాన్స్‌ వచ్చింది. అన్ని భాషల్లోనూ హిట్ అందుకుంది. ఓ వైపు హిట్‌ టాక్‌ అందుకుంటూనే మరోవైపు సోషల్‌ మీడియాతో వ్యతిరేకత వచ్చింది. మితిమిరిన హింస ఉండటం వల్ల ఓ వర్గం ఆడియన్స్‌ నుంచి మూవీకి వ్యతిరేకత వచ్చింది. అంతేకాదు ఈ సినిమా బ్యాన్‌ చేయాలనే డిమాండ్స్‌ కూడా వచ్చాయి. బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన ఈ సినిమా ఓ వైపు బ్యాన్‌ చేయాలనే విమర్శలు కూడా ఎదుర్కొంది. దీంతో ఈ చిత్రం వివాదంలో నిలిచింది. ఈ తరుణంలో ఈ మూవీ ఓటీటీపై రకరకాల పుకార్లు వచ్చాయి.


 అయితే అవన్ని వట్టి రూమర్స్‌ అనే తాజా ఓటీటీ ప్రకటనతో వెల్లడైంది. మార్కో చిత్రాన్ని ఓటీటీకి తీసుకువస్తున్న తాజాగా సోనీలీవ్‌ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా  మార్కో మూవీని స్ట్రీమింగ్‌ ఇస్తున్నట్టు సోనీలీవ్‌ వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో ఫిబ్రవరి 14 నుంచి సోనీలివ్‌లో అందుబాటులోకి రానుంది. ఇది తెలిసి ఓటీటీ ప్రియులంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఉన్ని ముకుందన్‌ ప్రధాన పాత్రలో నటించని ఈ చిత్రంలో సిద్ధిక్‌ జారజ్‌, జగదీప్‌, అన్సన్‌ పాల్‌, యుక్తి తరేజా, కబీర్‌ దుహాన్‌ సింగ్‌లు ముఖ్యపాత్రలు పోషించారు.