గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'గేమ్ చేంజర్' (Game Changer). సౌత్ ఇండియన్ స్టార్ ఫిలిం మేకర్, లెజెండరీ శంకర్ తెరకెక్కించిన చిత్రమిది. థియేటర్లలో ఆశించిన రెస్పాన్స్, కలెక్షన్స్ రాలేదు. దాంతో ఇప్పుడీ సినిమాను డిజిటల్ స్క్రీన్ మీద రిలీజ్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో రెడీ అయ్యింది.
ప్రైమ్ వీడియో ఓటీటీలో 'గేమ్ చేంజర్'... స్ట్రీమింగ్ లాంగ్వేజెస్‌లో ట్విస్ట్ ఉందండోయ్!'గేమ్ చేంజర్' ఓటీటీ హక్కుల్ని ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నెల 7వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నట్లు పేర్కొంది. జనవరి 10న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఓటీటీలో నెల రోజుల్లోపే వస్తుండటం గమనార్హం. అయితే... ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. పాన్ ఇండియా లాంగ్వేజెస్ అన్నిటిలోనూ సినిమా స్ట్రీమింగ్ కాదు.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హిందీ వెర్షన్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు తమ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో.
'గేమ్ చేంజర్' కథ ఏమిటి? రామ్ చరణ్ రోల్స్?'గేమ్ చేంజర్' సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేశారు. రామ్ నందన్ పాత్ర విషయానికి వస్తే... తొలుత అతడు ఐపీఎస్ చేస్తాడు. అయితే అతడిని ఐఏఎస్ అధికారిగా చూడాలని ఉందని తన మనసులో కోరికను ప్రేయసి బయట పడుతుంది. ఐఏఎస్ కాలేదని అతనితో మాట్లాడటం మానేసి వెళ్ళిపోతుంది. సివిల్స్ మళ్లీ రాసి ఐఏఎస్ అధికారి అవుతాడు రామ్ నందన్. విశాఖలో అతనికి పోస్టింగ్ లభిస్తుంది. ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి తనయుడు, మంత్రి బొబ్బిలి మోపిదేవితో రామ్ నందన్ గొడవ ఏమిటి? బొబ్బిలి మోపిదేవి మంత్రి పదవి నుంచి సస్పెండ్ కావడానికి రామ్ నందన్ ఎలా కారణం అయ్యాడు? రామ్ నందన్ తల్లిదండ్రులు పార్వతి అప్పన్నకు బొబ్బిలి మోపిదేవి తండ్రి సత్యమూర్తికి మధ్య సంబంధం ఏమిటి? చివరకు రామ్ నందన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. రామ్ నందన్ పాత్రలో కూడా ఆయన సెటిల్డ్ యాక్టింగ్ చేశారని రివ్యూ రైటర్స్ కూడా పేర్కొన్నారు. ఇక పార్వతిగా అంజలి నటనకు సైతం ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తమన్ పాటల్లో 'నానా హైరానా...' చార్ట్ బస్టర్ అయ్యింది. మిగతా పాటలు సైతం మంచి స్పందన అందుకున్నాయి. అయితే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ పోస్టర్ కాంట్రవర్సీకి కారణమైంది.
Also Read: 'గేమ్ చేంజర్' తీగ లాగితే... 'దేవర', 'పుష్ప 2' గుట్టు బయటకు వచ్చిందా?