OTT Web Series: ఉరి తీసిన 2 గంటల తర్వాత కూడా ఊపిరితో... రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Crime Thriller Web Series: దేశ రాజధాని ఢిల్లీని 80లలో షేక్ చేసిన రంగా, బిల్లా అనే నేరస్థుల ఉరితీత ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ పేరు ఏమిటి? అది ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

Continues below advertisement

రీసెంట్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఓటీటీలోకి వచ్చిన ఓ వెబ్ సిరీస్ ను తీహార్ జైలులో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా రూపొందించారు. అందులో అత్యంత క్రూరమైన ఇద్దరు అన్నదమ్ములను ఉరి తీయగా, ఒకరు మాత్రం ఉరి తీసిన 2 గంటల తర్వాత కూడా ఊపిరి తీసుకున్నాడనే షాకింగ్ విషయాన్ని చూపించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఆ వెబ్ సిరీస్ పేరు 'బ్లాక్ వారెంట్' (Black Warrant Web Series). ఈ క్రైమ్ డ్రామాకు విక్రమాదిత్య మోత్వాని, సత్యాన్షు సింగ్ దర్శకత్వం వహించారు. 7 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ లో జహాన్ కపూర్ లీడ్ రోల్ పోషించగా, జనవరి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఈ సిరీస్. ఒక్కో ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాల పాటు ఉంది. అందులో ఓ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ రంగా, బిల్లాల ఉరితీత. 

Continues below advertisement

ఎవరు ఈ రంగా, బిల్లా? 
Who is Kuljeet Singh and Jasbir Singh - Ranga Billa: గీతా చోప్రాపై అత్యాచారం చేసి, ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసిన అన్నదమ్ములు రంగా అలియాస్ కుల్జిత్ సింగ్, బిల్లా అలియాస్ జస్బీర్ సింగ్. 43 ఏళ్ల క్రితం 1982 జనవరి 1న వీరిద్దరినీ ఉరి తీశారు. ఢిల్లీలోని తీహార్ జైల్లో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే అప్పట్లో ఉరి తీసిన తర్వాత బిల్లా వెంటనే చనిపోయాడు కానీ , రంగా మాత్రం ఉరి తీసిన 2 గంటల తరువాత కూడా బ్రతికే ఉన్న ఘటన తీహార్ జైలు చరిత్రలో జరిగిందన్న విషయాన్ని తీహార్ జైలు మాజీ అధికారి సునీల్ గుప్తా, జర్నలిస్ట్ సునీత చౌదరి తమ 'బ్లాక్ వారెంట్' అనే పుస్తకంలో ప్రస్తావించారు. ఆ బుక్ ఆధారంగానే ఈ సిరీస్ తెరకెక్కింది. 

అసలేం జరిగిందంటే?
1978లో ఆగస్టులో రంగా, బిల్లా ఒక నేవీ అధికారి పిల్లలను కిడ్నాప్ చేశారు. గీతా చోప్రా, సంజయ్ చోప్రా అనే ఈ ఇద్దరు పిల్లలు రాత్రి 8 గంటల టైంలో ఓ ఈవెంట్ కు హాజరు కావడానికి ఇంటి నుంచి బయలుదేరారు. అయితే అదే దారిలో కాపు కాసి ఉన్న రంగా, బిల్లా గీతపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఇద్దరు పిల్లల్ని దారుణంగా చంపి అడవిలో పారేశారు. ఆ తరువాత వాళ్ళు మాయం అయ్యారు. రెండు రోజుల తీవ్ర గాలింపు తర్వాత దట్టమైన అడవిలో ఓ పశువుల కాపరికి ఆ ఇద్దరు పిల్లల మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. ఇక ఆ తర్వాత రంగా, బిల్లా ఇద్దరు తప్పించుకొని ఆగ్రాలో దాక్కున్నారు. సైలెంట్ గా ఆగ్రా స్టేషన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న కల్కా మెయిల్ అనే రైలు ఎక్కారు. కానీ అనుకోకుండా అదే కోచ్ లో ఎక్కిన ఒక ఆర్మీ అధికారి వీరిద్దరిని గుర్తుపట్టి, ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.

Also Read: చైతూ శోభితల పెళ్లి చూస్తారా? ఎన్ని కోట్లకు అమ్మారు? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

ఉరి తీసిన 2 గంటల తర్వాత కూడా ఊపిరితోనే... 
అప్పట్లో ఢిల్లీని కుదిపేసిన ఈ కేసులో రంగా, బిల్లాలను తీహార్ జైల్లో ఉంచారు. ఢిల్లీ హైకోర్టు ఈ ఇద్దరు అన్నదమ్ములకు ఉరిశిక్షను విధించింది. సుప్రీం కోర్టు సైతం వీరిద్దరి ఉరిని సమర్ధించింది. 1982 జనవరి 31న ఢిల్లీలోని తీహార్ జైలులో ఇద్దరినీ ఉరి తీశారు. అయితే ఉరి తీయగానే బిల్లా చనిపోయినప్పటికీ, రంగా మాత్రం 2 గంటల పాటు బ్రతికే ఉన్నాడని అంటారు. నిజానికి అప్పట్లో ఉరి తీసేటప్పుడు బాడీ వెయిట్ లాంటి మెజర్మెంట్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని సమాచారం. ఇప్పుడు ఉరిశిక్షలు పూర్తిగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. కానీ అప్పట్లో మాత్రం బిల్లా, రంగాల కేసు ఢిల్లీని షేక్ చేసింది.

Also Readథియేటర్లలో వచ్చిన నెలకే ఓటీటీలోకి 'గేమ్ చేంజర్'... ప్రైమ్ వీడియోలో ఈ వారమే రామ్ చరణ్ సినిమా స్ట్రీమింగ్... డేట్ తెల్సా?

Continues below advertisement