ప్రజెంట్ గోవా బ్యూటీ ఇలియానా ప్రెగ్నెంట్ అని ప్రేక్షకులు అందరికీ తెలుసు. తాను గర్భవతి అని గత నెలలో సోషల్ మీడియా వేదికగా ఆమె అనౌన్స్ చేశారు. అయితే, ఇప్పుడు బేబీ బంప్ ఫోటోలు పోస్ట్ చేశారు.
ఇలియానా బేబీ బంప్ చూశారా?
Ileana Baby Bump Alert : 'బంప్ అలర్ట్' అంటూ సోషల్ మీడియాలో ఇలియానా మూడు ఫోటోలు పోస్ట్ చేశారు. డైనింగ్ టేబుల్ దగ్గర ఆ ఫోటోలు దిగినట్లు చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. అంత కంటే స్పష్టంగా ఆ ఫొటోల్లో ఇలియానా బేబీ బంప్ కనబడుతోంది. ఆ ఫోటోలను హీరోయిన్ అన్యా సింగ్ తీశారు. తెలుగులో సందీప్ కిషన్ 'నిను వీడని నీడను నేను' సినిమాలో నటించారామె!
నిజం చెప్పాలంటే... ఇలియానా ప్రెగ్నెంట్ అని చెప్పిన కొన్ని క్షణాల్లో ఆమెపై విమర్శల జడివాన మొదలైంది. 'పెళ్లి కాకుండా తల్లి ఎలా అవుతున్నావు? ఇది సంప్రదాయమేనా?' అని కొందరు ప్రశ్నించారు. మరికొందరు 'తండ్రి ఎవరో చెప్పు?' అంటూ కామెంట్స్ చేశారు. ఈ విమర్శలను ఇలియానా లైట్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. కామెంట్స్ పక్కన పెట్టి కడుపులో బిడ్డతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
Also Read : 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య సక్సెస్ కొట్టారా? డిజప్పాయింట్ చేశాడా?
ప్రెగ్నెంట్ అని ఇలియానా ఎలా చెప్పారంటే?
'అండ్ సో ద అడ్వెంచర్ బిగిన్స్' (ఇప్పటి నుంచి సాహసయాత్ర మొదలు అయ్యింది) - ఈ కొటేషన్ రాసిన ఉన్న టీ షర్టును ఏప్రిల్ 18న ఇలియానా పోస్ట్ చేశారు. ఆ తర్వాత మెడలో 'అమ్మ' (Mama) అని రాసి ఉన్న చైన్ ధరించిన ఫోటోను పోస్ట్ చేశారు. ఈ రెండూ చూస్తే ఆమె గర్భవతి అని చెప్పడం పెద్ద కష్టం ఏమీ కాదు. ''త్వరలో వస్తుంది. నా లిటిల్ డార్లింగ్ ని కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అని క్యాప్షన్ ఇచ్చారు. ఇలియానాకు సినిమా పరిశ్రమలో పలువురు కంగ్రాట్స్ చెప్పారు.
కట్రీనాకు కాబోయే మరదలు ఇలియానా!
ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్, ఇలియానా కొన్నాళ్ళు డేటింగ్ చేశారు. ఆ సమయంలో ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకుని మీడియాకు కనిపించారు. అయితే, ఏమైందో? ఏమో? వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో వెంకటేష్ 'మల్లీశ్వరి', నందమూరి బాలకృష్ణ 'అల్లరి పిడుగు' సినిమాల్లో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కట్రీనా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ లారెంట్ మైఖేల్ (Sebastian Laurent Michel)కు ఇలియానా దగ్గర అయ్యారు.
Also Read : ఛత్రపతి రివ్యూ : బెల్లంకొండ బాలీవుడ్ రీమేక్ ఎలా ఉంది? న్యాయం చేశారా? చెడగొట్టారా?
'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి కట్రీనా కైఫ్ (Katrina Kaif) వచ్చారు. అప్పటికి కొన్ని రోజుల ముందు జరిగిన ఆమె బర్త్ డే వేడుకల్లో ఇలియానా సందడి చేశారు. ఆ విషయం గురించి కరణ్ జోహార్ ప్రశ్నించగా... తన సోదరుడితో ఇలియానా డేటింగ్ విషయాన్ని పరోక్షంగా కట్రీనా కన్ఫర్మ్ చేశారు. అదీ సంగతి! కొన్ని రోజులుగా డేటింగులో ఉన్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది ఇంకా తెలియదు. హిందీలో అభిషేక్ బచ్చన్ 'ది బిగ్ బుల్', తెలుగులో రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' తర్వాత ఇలియానా మళ్ళీ సినిమాలు చేయలేదు.