తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథానాయికలుగా ఉన్న తెలుగమ్మాయిలు చాలా తక్కువ. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వారిలో చాందినీ చౌదరి ఒకరు. ఇప్పటికే చాలా చిత్రాల్లో నటించారు. గత ఏడాది ‘కలర్ ఫొటో’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడామె చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. అందులో ‘సమ్మతమే’ ఒకటి. ఈ సినిమా టీజర్‌‌ను గురువారం విడుదల చేశారు. అందులో చాందినీ చౌదరి సిగరెట్ తాగుతూ కనిపించారు. మందు కొడుతూ కనిపించారు.


Also Read: అక్కినేని ఫ్యామిలీ ఫ్రెండ్‌తో... సమంత ఆధ్యాత్మిక యాత్ర


సిల్వర్ స్క్రీన్స్ మీద సిగరెట్ తాగుతూ, మందు కొడుతూ కనిపించిన వాళ్లందరూ రియల్ లైఫ్‌లో అదే విధంగా చేస్తారని కాదు. మోడ్రన్ అమ్మాయిలు చాలామంది మందు, దమ్ము కొడుతున్నారు. క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు లేదా అటువంటి క్యారెక్టర్లు వచ్చినప్పుడు కొంతమంది హీరోయిన్లు మందు, సిగరెట్ పట్టుకుంటున్నారు. ‘సమ్మతమే’ కోసం చాందినీ చౌదరి కూడా అదే పని చేశారు. అయితే, ఆడియన్స్ ఆ సంగతి గమనించారు. ‘చాందిని... మధ్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని సరదాగా జాగ్రత్తలు చెప్పారు. వాటిని చూసి ఆమె కూడా సరదాగా స్పందించారు.


‘సమ్మతమే’ టీజర్‌‌లో హీరో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగుల్లా కనిపించారు. ఇద్దరి మధ్య సన్నివేశాలు బావున్నాయి. పాటను పాటగా కాకుండా మాటగా మాట్లాడాలని గేమ్ పెట్టుకోవడం, సందర్భాలకు అనుగుణంగా చక్కటి పాటలను ఎంచుకోవడం బావుంది. అలాగే, శేఖర్ చంద్ర అందించిన నేపథ్య సంగీతమూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘జగమంత సగమైనా... క్షణమే ఓ యుగమైనా... ఈ వలపు మలుపుల్లో సతమతము సమ్మతమే’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌‌లో కొన్ని లైన్లను టీజర్‌‌లో వినిపించారు. టీజర్‌‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘కలర్ ఫొటో’తో చాందినీ చౌదరి... ‘ఎస్‌‌ఆర్ కళ్యాణ మండపం’తో కిరణ్ అబ్బవరం... ఇద్దరూ సక్సెస్‌‌లలో ఉన్నారు. ఈ సినిమాతోనూ సక్సెస్ అందుకోవాలని ఆశిద్దాం.



Also Read: 'భీమ్లా నాయక్' కొత్త స్టిల్.. పవన్, రానా పోజు చూశారా..?


Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?


Also Read: బిగ్ బాస్ హౌస్ లోకి లోబో రీ-ఎంట్రీ ..యదవనయ్యా అన్న షణ్ముక్-కన్నీళ్లు పెట్టుకున్న సిరి…!


Also Read: అనారోగ్యం వల్ల కొద్దిసేపే చూస్తానన్న ఉప రాష్ట్రపతి ..సినిమా మొత్తం అయ్యేవరకూ కదల్లేదట


Also Read: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా రాజు ఎవరి కూతురో తెలుసా?


Also Read: తమన్నా ఔట్-అనసూయ ఇన్..హాట్ యాంకర్ అంతకుమించి అనిపిస్తుందా..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి