పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.


Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?


ఇప్పటికే సినిమాలో పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలను టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. మొన్నామధ్య సినిమా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయగా.. దానికి విపరీతమైన బజ్ వచ్చింది. రీసెంట్ గానే 'అంత ఇష్టం ఏందయ్యా' అంటూ సాగే సెకండ్ సాంగ్ ను విడుదల చేశారు. తాజాగా సినిమా నుంచి మరో స్టిల్ లు వదిలారు. 


షూటింగ్ అనంతరం అలసిపోయిన పవన్ కళ్యాణ్, రానా రెస్ట్ తీసుకుంటున్నట్లుగా ఉన్నారు. అప్పుడు క్లిక్ మనిపించిన ఫోటోను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సినిమా క్లైమాక్స్ షూటింగ్ లో ఈ ఫోటో తీశారంటూ ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా.. ఈ ఫోటో మాత్రం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. 


ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా కనిపించనుంది. రానాకి భార్యగా నటి సంయుక్త మీనన్ కనిపించనుంది. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నారు.