అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ పై జూబ్లీహిల్స్ పోలీసులు మండిపడుతున్నారు. ఐదు వేల పాస్‌లకు మాత్రమే పర్మిషన్ తీసుకొని.. ఎక్కువ పాస్‌లను జారీ చేసిన శ్రేయాస్ క్రియేషన్స్ మీడియాతో పాటు ఈవెంట్ ఆర్గనైజేషన్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఐపీసీ సెక్షన్ 143, 341, 336, 290 కింద కేసులు నమోదు చేశారు.
నిన్న(డిసెంబర్ 12) సాయంత్రం యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్ లో 'పుష్ప' ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆదివారం ఉదయం నుంచే యూసఫ్‌గూడ ప్రాంతానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. వేల సంఖ్యలో ప్రజలు ఈ ఈవెంట్ కి రావడంతో ఆ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. యూసఫ్‌గూడ రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ అవ్వడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.
తమ అభిమాన హీరోని చూడడానికి ఫ్యాన్స్ అందరూ ఎగ్జైట్మెంట్ తో బారికేడ్లు తోసేసి మరీ రావడంతో.. అక్కడ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి ఈవెంట్ మేకర్స్, బౌన్సర్లు ప్రయత్నించినప్పటికీ కంట్రోల్ చేయలేకపోయారు. అంతమంది జనాలు రావడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. ఐదు వేల పాస్‌లకు మాత్రమే పర్మిషన్ తీసుకోగా.. అంతకంటే ఎక్కువ పాస్‌లను జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఈవెంట్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 17న విడుదల కానున్న 'పుష్ప' సినిమాలో రష్మిక హీరోయిన్, ఫహద్ ఫాజిల్ విలన్ , సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో వెయిట్ అండ్ సీ...
Also Read:పుష్ప రాజ్.. 'స్పైడర్ మ్యాన్'ని బీట్ చేయగలడా..?
Also Read:సమంత ఐటెం సాంగ్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్..
Also Read:బన్నీతో సమంత 'నాటు' స్టెప్.. ఊరమాస్ ఉందే..
Also Read: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?
Also Read: ఇది కేవలం జెర్సీ మాత్రమే కాదు.. నాగచైతన్య ఎందుకు అలా అన్నాడంటే?
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూసి రామ్, భీమ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి