సౌత్ లో కూడా బిగ్ బాస్ షో టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో సీజన్ 5 నడుస్తోంది. అయితే తమిళ బిగ్ బాస్ సీజన్ 5కి హోస్ట్ గా శృతిహాసన్ కనిపించనుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఈ షోకి హోస్ట్ గా కమల్ హాసన్ వ్యవహరిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఆయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా బట్టల బిజినెస్ మొదలుపెట్టడానికి కమల్ హాసన్ అమెరికాకు వెళ్లారు. 

 


 

తిరిగొచ్చిన తరువాత ఆయనకు దగ్గు రావడంతో పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లోనే ఐసోలేషన్ లో ఉంటున్నారు. అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పుడు కమల్ హాస్పిటల్ లో ఉండడంతో ఆయన హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ 5 బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. 

 

కమల్ స్థానంలో టెంపరరీగా ఆయన కూతురు శృతిహాసన్ ను తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ రేంజ్ లో ఎవరు హోస్ట్ చేస్తారని ఆలోచించిన షో నిర్వాహకులకు శృతిహాసన్ మంచి ఆప్షన్ గా కనిపించింది. దీంతో ఆమెని సంప్రదించారట. దీనిపై శృతి త్వరలోనే క్లారిటీ ఇవ్వనుందని తెలుస్తోంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4లో షూటింగ్ కారణంగా నాగార్జున కొన్ని ఎపిసోడ్స్ ని హోస్ట్ చేయలేకపోయారు. ఆయన స్థానంలో రమ్యకృష్ణ, సమంత ప్రేక్షకులను అలరించారు. మరి తమిళ బిగ్ బాస్ లో ఏమవుతుందో తెలియాలంటే కొన్నిరోజులు ఎదురుచూడాల్సిందే!

 

ఇక శృతిహాసన్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు ఓకే చేస్తుంది. ప్రభాస్ తో 'సలార్' సినిమాలో నటిస్తోంది. అలానే బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోపక్క బాలీవుడ్ లో కూడా కొన్ని ప్రాజెక్ట్ లు ఓకే చేస్తోంది.   

 



 









Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి