తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. అన్నీ తెలియని ముఖాలే అనుకుంటూనే ఐదువారాలు గడిచిపోయింది. ఇప్పుడిప్పుడే షో పై మరింత ఆసక్తి ప్రదర్శిస్తన్నారు ప్రేక్షకులు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడోవారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదోవారం హమీద ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఆరో వారం ఏకంగా పది మంది నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో శ్వేత ఎలిమినేట్ అవుతుందనే చర్చ జరుగుతోంది.
నామినేషన్లో ఉన్నవారిలో మానస్, షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, సన్నీ కి బాగానే ఓట్లు పడుతున్నాయని టాక్. అనవసరంగా యాంకర్ రవి ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకుని పరువు పోగొట్టుకుంటున్నా.. టాస్క్‌ల్లో ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు. దీంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ లిస్ట్‌లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం నామినేషన్స్‌లో ఉన్న అందరికన్నా ఎక్కువగా షణ్ముఖ్‌కే ఓట్లు పడుతున్నాయని టాక్. సన్నీ, మానస్ కూడా స్ట్రాంగ్ అవుతున్నారు. గడిచిన సీజన్లో సోహెల్, అఖిల్ లా మంచి ఫ్రెండ్స్ అంటున్నారు. శ్రీరామ్ చంద్ర, సిరి, ప్రియాంక సింగ్, జెస్సీ వీళ్లు సేఫ్ జోన్లో ఉన్నారు. లోబో, ప్రియ పై శనివారం ఏపిసోడ్ కి సంబంధించి విడుదల చేసిన ప్రమోలో ఇద్దర్లో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పారు హోస్ట్ నాగార్జున. అంటే శనివారం ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోగా శ్వేత వర్మ ఆదివారం ఎలిమినేట్ అవుతోందని తెలుస్తోంది.
Also Read: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా.. ఎన్నికల ముందు విడుదలకు ప్లాన్
శ్వేతకి పెద్దగా క్రేజ్‌లేదు. బిగ్ బాస్ హౌస్ కి వచ్చేవరకూ ఆమె ఎవరో ప్రేక్షకులకు తెలియదు. వచ్చిన తర్వాత కూడా పెద్దగా ఆమె గ్రాఫ్ పెరిగిందీ లేదు. నామినేషన్స్ గండం నుంచి తప్పించుకోవడం వల్ల ఆమె మిగిలిపోయింది కానీ లేదంటే ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేదంటున్నారు. పైగా గత ఐదు ఎలిమినేషన్స్ గమనిస్తే.. ఎవరైతే గొడవలు పెట్టుకుని హౌస్‌లో రచ్చ చేశారో వాళ్లంతా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. సరయు రచ్చ, ఉమాదేవి గోల, లహరి అవసర వాదనలు, నటరాజ్ మాస్టర్ బెదిరింపులు, హమీదా ఓవరాక్షన్ వాళ్లు ఇంటి నుంచిబయటకు వెళ్లిపోయేలా చేసిందనే చర్చ జరిగింది. ఇక ఇచ్చిపడేస్తా అని రెచ్చిపోయిన శ్వేతకి ఈ వారం ఉద్వాసన చెప్పేస్తున్నారట.
Also Read: షాకింగ్ ట్విస్ట్..ఈరోజే ఎలిమినేషన్ .. వాళ్లిద్దరిలో ఎవరంటే..
Also Read : ఫస్ట్ టైం కార్పొరేట్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా స్టార్ హీరో
Also Read: ఆహా 'టాక్ షో' కోసం బాలయ్యకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్….!
Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. 'మా' అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారోత్సవంలో మోహన్ బాబు కామెంట్స్ వైరల్
Also Read: 'జబర్ధస్త్' షో కి జడ్జీగా వస్తానన్న బాలకృష్ణ, నటసింహంతో ఫోన్లో మాట్లాడిన రోజా
Also Read: పాపిట్లో సింధూరం..మెడలో నల్లపూసలు.. బాలయ్య బ్యూటీ పెళ్లెప్పుడు చేసుకుందబ్బా...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి