Raj Kundra : రాజ్ కుంద్రా, శిల్పాషెట్టిలకు మరో షాక్ ... కేసు పెట్టిన షెర్లిన్ చోప్రా !

రాజ్ కుంద్రా, శిల్పాషెట్టిలు మనసికంగా వేధిస్తున్నారంటూ నటి షెర్లిన్ చోప్రా కేసు పెట్టింది. రాజ్ కుంద్రాపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా చేసింది.

Continues below advertisement

 పోర్న్ ఫిల్మ్స్ కేసులో ఇరుక్కుని చాలా రోజుల పాటు జైల్లో ఉండి ఇటీవలే బయటకు వచ్చిన రాజ్ కుంద్రాకు మరో చిక్కు వచ్చి పడింది. రాజ్ కుంద్రాతో పాటు శిల్పా శెట్టిపై బాలీవుడ్ నటి, మోడల్ షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్ కుంద్రా నన్ను తనను మోసం చేశాడని అంతేకాక మానసిక క్షోభకు కూడా గురి చేస్తున్నారని ఆమె జుహు పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాజ్ కుంద్రా తనను లైంగిక వేధింపులకు కూడా గురి చేశారని ఆరోపించింది. రాజ్ కుంద్రాకు అండర్ వరల్డ్ తో సంబంధం ఉందని, వారి ద్వారా కూడా తనను బెదిరించారని మీడియా ఎదుట ఆరోపణలు గుప్పించారు.

Continues below advertisement

Also Read : చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. 'మా' అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారోత్సవంలో మోహన్ బాబు కామెంట్స్ వైరల్

రాజ్ కుంద్రా కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఆమె మీడియాలో వివాదాస్పద ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. రాజ్ కుంద్రాపై అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. రాజ్ కుంద్రా తనతోనూ అలాంటి సినిమాలు తీయాలనుకున్నారని.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు కూడా ఓసారి పిలిచి ప్రశ్నించారు. రాజ్ కుంద్రా జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆమె ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో ఆధారాలు లేని ఆరోపణలు ఆపకపోతే .. పరువు నష్టం కేసులు వేస్తామని రాజ్ కుంద్రా, శిల్పాషెట్టి ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆమె రివర్స్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read : ఆహా 'టాక్ షో' కోసం బాలయ్యకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్….!

షెర్లిన్ చోప్రా శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ముద్దుపెట్టుకున్నారని.. తనను పోర్న్ మూవీస్‌లోకి తీసుకువచ్చింది రాజ్ కుంద్రానే అని షెర్లిన్ ఆరోపించింది. ఆమె రాజ్ కుంద్రా ప్రాజెక్టుల్లో కలిసి పనిచేసింది.  2019 నుంచి ఆమె రాజ్ కుంద్రాతో పోర్న్ కంటెంట్‌ క్రియేషన్‌లో పాల్గొంటోంది. షెర్లిన్ చోప్రా  ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణ జరిపిన తర్వాత రాజ్‌ కుంద్రా, శిల్పాషెట్టిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Also Read : పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన బాహుబలి విలన్

షెర్లిన్ చోప్రా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన నటే.  హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. 1999లో మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమాలో నటించింది. అమెరికన్ శృంగార పత్రిక ప్లే బాయ్ కు న్యూడ్‌గా ఫోటోలకు ఫోజులిచ్చిన మొదటి ఇండియన్ మోడల్ షెర్లిన్ చోప్రానే. చాలా కాలంగా బాలీవుడ్‌ సినిమాల్లో వ్యాంప్ తరహా పాత్రల్లో నటిస్తోంది.

Also read: ఈ-సిగరెట్లు సురక్షితమనుకుంటున్నారా? అందులో కూడా కెమికల్స్ ఉన్నాయంటున్న అధ్యయనం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement