ఈ-సిగరెట్లు... చాలా సంస్థలు వీటిని తయారుచేసి మార్కెట్లోకి వదులుతున్నాయి. ఇది సిగరెట్ ఆకారంలోనే ఉంటుంది. కానీ ఎలాంటి పొగాకు ఉండదు. నికోటిన్ రుచిని తలపించే ద్రావణాలు ఉంటాయి. దీన్ని పీల్చినప్పుడు పొగాకు పీల్చినట్టుగా అనిపిస్తుంది. పొగాకు ప్రమాదమని అనుకునేవాళ్లు, దాన్ని మానలేక, ప్రత్యామ్నాయంగా ఈ-సిగరెట్ల బాట పడుతున్నారు. ఇలా మనదేశంలో చాలా మంది యువత ఈ-సిగరెట్లకు అలవాటు పడింది. కానీ ఇవి కూడా యువత ఆరోగ్యాన్ని చెడగొట్టేవని చెబుతోంది కొత్త అధ్యయనం. దీనిలో దాదాపు 2000 రకాల రసాయనాలు ఉన్నాయని, వాటిలో చాలా మటుకు గుర్తించలేనివేనని తేల్చింది ఈ పరిశోధన. వాటిలో గుర్తించిన పారిశ్రామిక రసాయనాలు, కెఫీన్ కూడా ఉన్నట్టు చెబుతోంది. 


జాన్ హప్కిన్స్ యూనివర్సిటీ వారు ఈ పరిశోధనను నిర్వహించారు. దాని ప్రకారం సాధారణ సిగరెట్లలో ఉండే నికోటిన్ వంటివి ఈ-సిగరెట్లలో చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇతర రసాయనాలు చాలానే ఉన్నాయి. వాటిలో మూడు రసాయనాలతో సహా, ఆరు హానికరమైన పదార్థాలు తయారీలో వాడినట్టు బయటపడింది. ముఖ్యంగా స్టిమ్యులేటెడ్ కెఫీన్ ఉన్నట్టు తెలిసింది. ఇంతవరకు కెఫీన్ కేవలం కాఫీ, చాక్లెట్లలోనే ఉంటుందని అనుకున్నారు, కానీ ధూమపానం చేసేవారికి అదనపు కిక్ ఇవ్వడానికి  ఈ-సిగరెట్ల తయారీదారులు కెఫీన్ ను కావాలనే జోడించినట్టు భావిస్తున్నరు పరిశోధకులు. అయితే ఆ విషయాన్నిబహిర్గతం మాత్రం చేయడం లేదు తయారీదారులు. 


ఈ-సిగరెట్లు చాలా సురక్షితం అని భావించే వాళ్లకు ఈ పరిశోధన కాస్త నిరాశ కలిగించేదే. ఈ కొత్త పరిశోధనలో వాపింగ్ లిక్విడ్, ఏరోసోల్స్ లో పూర్తి స్థాయి రసాయనాలను వెతికేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఈ-సిగరెట్ల తయారీదారులు వాటి తయారీలో వాడిన పదార్థాలను బయటపెట్టకుండా దాస్తున్నట్టు  కూడా ఈ పరిశోధనలో తేలింది. కాబట్టి ఎలాంటి ధూమపానానికైనా దూరంగా ఉండడం ఉత్తమం. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: మహనీయుల్లో కనిపించే లక్షణాలు ఇవన్నీ... నేర్చుకుంటే మీరూ గొప్పవారే


Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు


Also read: బాదం పలుకులను నీటిలో నానబెట్టి తింటేనే ఎక్కువ లాభాలా? పచ్చిగా తినాలా?


Also read: పిల్లలకు తీపి పదార్థాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది, లేకుంటే పెద్దయ్యాక కష్టాలే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి