బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో తాత్కాలిక పండ్ల మార్కెట్ ప్రారంభమయ్యింది. శుక్రవారం నుంచి ఇక్కడ పండ్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ నుంచి తాత్కాలికంగా బాటసింగారంలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మార్కెట్‌ను ఇవాళ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక నేతలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా సంక్షేమం కోసమేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో పండ్ల మార్కెట్ ప్రారంభమయ్యింది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ను బాటసింగారంలో మార్కెట్‌ కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. 


Watch: ఖమ్మం జిల్లాలో సోనూసూద్‌కు గుడి కట్టిస్తున్నారు..


కోహెడలో శాశ్వత మార్కెట్


పండ్ల క్రయ, విక్రయాలు ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆపిల్, సంత్ర, ద్రాక్ష, పైనాపిల్ పండ్ల తొలి వేలాన్ని పరిశీలించారు. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ను బాటసింగారం లాజిస్టిక్స్ పార్కుకు తాత్కాలికంగా తరలించామన్నారు. వ్యాపారులు సహకరిస్తే వీలైనంత త్వరలో కోహెడలో‌ అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. అప్పటి వరకూ క్రయ, విక్రయాలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. వ్యాపారులు ఎటువంటి అపోహలకు గురికావద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. 


Also Read: చెంబులో తల పెట్టిన మూగజీవి... పిల్లి అనుకుని సాయం చేయబోయిన వైఎస్సార్టీపీ నేత... పులిపిల్ల అని తెలిసి పరుగో పరుగు


ఇబ్బందులు తొలగించేందుకు సిద్ధం


ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తాత్కాలిక పండ్ల మార్కెట్‌ ఏర్పాటు చేసిన దృష్ట్యా కమీషన్‌ ఏజెంట్లు సహకరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. వ్యాపారులంతా సహకరిస్తే కొహెడలో శాశ్వత ప్రాతిపదికన మార్కెట్ నిర్మాణం కార్యరూపం దాలుస్తుందన్నారు. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులున్నా తొలగించేందుకు సిద్ధమని మంత్రి ప్రకటించారు.


Also Read: మావోయిస్టు నేత ఆర్కే మరణం ప్రభుత్వ హత్యే... మావోయిస్టుల ఆహారంలో విషం కలుపుతున్నారు... ఆర్కే భార్య శిరీష ఆరోపణ


Also Read: రాజకీయ విమర్శలపై ప్రతిపక్షాలు, మీడియాకు ఏపీ డీజీపీ పరువు నష్టం నోటీసులు ! దేశంలోనే మొదటి సారి !


Also Read: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి.. నిర్ధారించిన పార్టీ కేంద్ర కమిటీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి