ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తనకు ఇష్టమైన వంటకాలు, ప్రాంతాలు, సినిమాల గురించి మాట్లాడాడు. సెలవు దొరికితే మహారాష్ట్రలో ఎక్కడ పర్యటించాలని అనుకుంటాడో చెప్పేశాడు. ముంబయి ఇండియన్స్ ఫ్రాచైజీ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
Also Read: తుది సంగ్రామం నేడే.. కప్పు కోల్‌కతా కొడుతుందా.. చెన్నై చేతికొస్తుందా?
మహారాష్ట్ర వంటకాల్లో కోతింబిర్ వాడి, మిసాల్ పావ్, పూరన్ పోలీ వంటకాల్లో దేనికి ఎలాంటి రేటింగ్ ఇస్తారని అడగ్గా.. కోతింబిర్ వాడికి తొలి ప్రాధాన్యం ఇచ్చాడు. మిసాల్ పావ్, పూరన్ పోలీకి రెండు, మూడో రేటింగ్ ఇచ్చాడు. ఆమిర్ ఖాన్ నటించిన లగాన్, షారుఖ్ నటించిన చక్‌దే ఇండియా, భాగ్‌మిల్కా భాగ్‌కు రేటింగ్ అడగ్గా కష్టమని చెప్పాడు. అయితే క్రికెట్ సంబంధించింది కాబట్టి లగాన్‌కు తొలి ప్రాధాన్యం ఇస్తానని చెప్పాడు. చక్‌దే, భాగ్ మిల్కాను తర్వాతి స్థానంలో ఉంచాడు.
Also Read: నేనైతే అశ్విన్‌కు చోటివ్వను..! కేవలం పరుగుల్ని నియంత్రిస్తే సరిపోదన్న మంజ్రేకర్
ముంబయి సమీపంలోని ఖండాలా, గోవా, మహాబలేశ్వరంలో ఔటింగ్‌కు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించగా.. మొదటి స్థానం ఖండాలాకు ఇచ్చాడు. స్థానికంగా ప్రయాణించేందుకు దేనిని ఎంచుకుంటాడో రోహిత్ వివరించాడు. ముంబయిలో తనకు ఇష్టమైన మైదానాల్లో ఆజాద్ మైదాన్, క్రాస్ మైదాన్, శివాజీ పార్క్‌కు వరుసగా ప్రాధాన్యం ఇచ్చాడు. ఇక గాయకులలో సోనూ నిగమ్‌కు ఓటు వేశాడు.
Also Read: ఓటమితో గుండె పగిలిన రిషభ్ పంత్.. కన్నీరు పెట్టుకున్న పృథ్వీ షా! చూసిన వాళ్లూ బాధపడ్డారు
ఇండియన్ ప్రీమియర్ లీగులో ముంబయి ఇండియన్స్‌ను ఈ సారి రోహిత్ విజేతగా నిలపాలని భావించాడు. జట్టు కూర్పు, ఇతర కారణాల వల్ల ముంబయి అంతగా రాణించలేదు. దురదృష్టవశాత్తు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేదు. బ్యాటర్‌గానూ హిట్‌మ్యాన్ తన స్థాయికి తగినట్టు ఆడలేదు. 13 మ్యాచుల్లో 130 స్ట్రైక్‌రేట్‌తో 381 పరుగులు చేశాడు. లీగ్ ముగియడంతో నేరుగా దుబాయ్‌లోని ప్రపంచకప్ బయో బుడగలోకి ప్రవేశించాడు. వన్డే ప్రపంచకప్‌లోని ప్రదర్శననే అతడు పునరావృతం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి