మన సమాజంలో, చరిత్రలో ఎంతో మంది గొప్పవారిగా గౌరవాన్ని పొందుతున్నారు. వారు ఏం చేసినా ప్రజలకు నచ్చుతుంది. వారినే తమ మార్గదర్శకులుగా తీసుకుంటారు జనాలు. ఆ గొప్పతనం వారి వ్యక్తిత్వానిదే. అలాంటి వ్యక్తిత్వం కావాలంటే కొన్ని లక్షణాలను అలవరచుకోకతప్పదు.
1. ప్రశాంతత
మహనీయులుగా పేరు పొందిన వారెప్పుడూ తమ నియంత్రణను కోల్పోరు. కోపాన్ని అందరిముందు ప్రదర్శించరు. తమ సహనాన్ని కోల్పోరు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేందుకే ప్రయత్నిస్తారు. తమ స్వరం, ముఖ కవళికలు, మొత్తం బాడీ లాంగ్వేజ్ ని నియంత్రణలోనే ఉంచుకుంటారు.
2. అతిగా మాట్లాడరు
ఎవరైనా ఏదైనా చెబితే వినేందుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అతిగా మాట్లాడరు. అందుకే ఆంగ్లంలో ‘man of few words’అనే వాక్యం పుట్టింది. గొప్ప వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఈ వాక్యాన్ని వాడుతుంటారు.
3. సహాయకారి
గౌరవ భావం ఊరికే రాదు. ప్రజలకు అవసరమైన సమయాల్లో మీ పరిధులు దాటి వచ్చి సాయం చేయాల్సి ఉంటుంది. చేసిన సాయాన్ని పదిమందికి తెలిసేలా అనవసర హంగామా సృష్టించరు. అందుకే వారికి తెలియకుండానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ ఉంటుంది.
4. కష్టపడేతత్వం
చేసే పనిలో నిజాయితీగా ఉండడంతో పాటూ తీవ్రంగా కష్టపడతారు. కష్టపడి పనిచేసే వాళ్లని చూస్తే ఎవరికైనా ఇట్టే గౌరవభావం కలుగుతుంది.
5. తప్పులను ఒప్పుకునే తత్వం
వీరికి అహంకారం ఉండదు. తాము చేసిన తప్పులను స్వయంగా ఒప్పుకునే గొప్ప స్వభావం వీరిది. అది స్వచ్ఛందంగానే తమ తప్పును తాము తెలుసుకుని, ఒప్పుకుంటారు. ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు.
6. ఆత్మవిశ్వాసం
చాలా మంది తామేమీ చేయలేమంటూ ఆత్మన్యూనత భావంతో ఉంటారు. కానీ గొప్పవాళ్లుగా పేరుపొందిన వాళ్లు ఆ భావాన్ని అధిగమిస్తారు. తమపై తాము ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. పొరపాటు చేసినప్పటికీ దాన్ని సొంతంగా స్వీకరించి, సరిదిద్దుతారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు
Also read: బాదం పలుకులను నీటిలో నానబెట్టి తింటేనే ఎక్కువ లాభాలా? పచ్చిగా తినాలా?
Also read: పిల్లలకు తీపి పదార్థాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది, లేకుంటే పెద్దయ్యాక కష్టాలే