త్వరలోనే విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రానా దగ్గుబాటి. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కాగా దసరా రోజున రానా నటించబోయే కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఇది దగ్గుబాటి అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. పాన్ ఇండియా స్థాయిలో, భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాలో రానా హీరోగా నటించబోతున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది మిలింద్ రావ్. ఈయన ఇటీవల నయనతారతో కలిసి ‘నెట్రికణ్’ అనే సినిమాను రూపొందించారు. డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. గతంలో ‘గృహం’అనే సినిమాకు దర్శకత్వం వహించారు మిలింద్. 


రానా కొత్త సినిమాకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం ట్విట్టర్ లో  ట్రెండవుతున్నాయి. దాన్ని బట్టి ఈ సినిమాను గోపీనాథ్, అర్జున్ దాస్యన్, రాంబాబు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఇంకా హీరోయిన్, ఇతర పాత్రల ఎంపిక త్వరలో జరగనుంది. ఈ సినిమాకు ‘ధీరుడు’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం రానా తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లానాయక్ లో కూడా నటిస్తున్నారు.


ఈ ఏడాది విడుదలైన రానా సినిమా ‘అరణ్య’. దసరా కానుకగా దీన్ని జీ5లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సంపాదించింది. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. 





Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు


Also read: బాదం పలుకులను నీటిలో నానబెట్టి తింటేనే ఎక్కువ లాభాలా? పచ్చిగా తినాలా?


Also read: ఈ-సిగరెట్లు సురక్షితమనుకుంటున్నారా? అందులో కూడా కెమికల్స్ ఉన్నాయంటున్న అధ్యయనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి