20 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 165-9, 27 పరుగులతో చెన్నై విజయం
బ్రేవో వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. 27 పరుగులతో చెన్నై విజయం సాధించింది.
వరుణ్ చక్రవర్తి 0(0)
లోకి ఫెర్గూసన్ 18(11)
డ్వేన్ బ్రేవో 4-0-29-1
-----
19 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 162-8, లక్ష్యం 193 పరుగులు
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ఫెర్గూసన్ ఒక సిక్సర్, ఒక ఫోర్ కొట్టాడు. కోల్‌కతా విజయానికి 6 బంతుల్లో 31 పరుగులు కావాలి.
శివం మావి 19(9)
లోకి ఫెర్గూసన్ 16(9)
శార్దూల్ ఠాకూర్ 4-0-38-3
-----
18 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 145-8, లక్ష్యం 193 పరుగులు
డ్వేన్ బ్రేవో వేసిన ఈ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. శివం మావి రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. కోల్‌కతా విజయానికి 12 బంతుల్లో 48 పరుగులు కావాలి.
శివం మావి 18(7)
లోకి ఫెర్గూసన్ 4(4)
డ్వేన్ బ్రేవో 3-0-26-0
-----
17 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 127-8, లక్ష్యం 193 పరుగులు
జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. ఇయాన్ మోర్గాన్ అవుటయ్యాడు. కోల్‌కతా విజయానికి 18 బంతుల్లో 66 పరుగులు కావాలి.
శివం మావి 1(2)
లోకి ఫెర్గూసన్ 3(3)
జోష్ హజిల్‌వుడ్ 4-0-29-2
ఇయాన్ మోర్గాన్ (సి) దీపక్ చాహర్ (బి) జోష్ హజిల్‌వుడ్ (4: 8 బంతుల్లో)
-----
16 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 125-7, లక్ష్యం 193 పరుగులు
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. రాహుల్ త్రిపాఠి అవుటయ్యాడు. కోల్‌కతా విజయానికి 24 బంతుల్లో 68 పరుగులు కావాలి.
ఇయాన్ మోర్గాన్ 4(5)
లోకి ఫెర్గూసన్ 2(2)
శార్దూల్ ఠాకూర్ 3-0-21-3
రాహుల్ త్రిపాఠి (సి) మొయిన్ అలీ (బి) శార్దూల్ ఠాకూర్ (2: 3 బంతుల్లో)
------
15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 120-6, లక్ష్యం 193 పరుగులు
రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. దినేష్ కార్తీక్, షకీబ్ అల్ హసన్ అవుటయ్యాడు. కోల్‌కతా విజయానికి 30 బంతుల్లో 73 పరుగులు కావాలి.
ఇయాన్ మోర్గాన్ 3(4)
రవీంద్ర జడేజా 4-0-32-1
దినేష్ కార్తీక్ (సి) రాయుడు (బి) జడేజా (9: 7 బంతుల్లో, ఒక సిక్సర్)
షకీబ్ అల్ హసన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా (0: 1 బంతి)
-----
14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 117-4, లక్ష్యం 193 పరుగులు
దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. కోల్‌కతా విజయానికి 36 బంతుల్లో 76 పరుగులు కావాలి.
దినేష్ కార్తీక్ 8(3)
ఇయాన్ మోర్గాన్ 2(3)
దీపక్ చాహర్ 4-0-32-1
శుభ్‌మన్ గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీపక్ చాహర్ (51: 43 బంతుల్లో, ఆరు ఫోర్లు)
-----
13 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 108-3, లక్ష్యం 193 పరుగులు
రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 42 బంతుల్లో 87 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 51(41)
ఇయాన్ మోర్గాన్ 1(2)
రవీంద్ర జడేజా 3-0-34-0
----
12 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 99-3, లక్ష్యం 193 పరుగులు
జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. సునీల్ నరైన్ అవుటయ్యాడు. కోల్‌కతా విజయానికి 48 బంతుల్లో 94 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 42(35)
ఇయాన్ మోర్గాన్ 1(2)
జోష్ హజిల్‌వుడ్ 2-0-16-2
నరైన్ (సి) జడేజా (బి) హజిల్ వుడ్ (2: 2 బంతుల్లో)
------
11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 93-2, లక్ష్యం 193 పరుగులు
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా అవుటయ్యారు. కోల్‌కతా విజయానికి 54 బంతుల్లో 100 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 36(29)
నరైన్ 0(0)
శార్దూల్ ఠాకూర్ 2-0-16-2
వెంకటేష్ అయ్యర్ (సి) జడేజా (బి) ఠాకూర్ (50: 32 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు)
నితీష్ రాణా (సి) డుఫ్లెసిస్ (బి) ఠాకూర్ (0: 1 బంతి)
----
10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 88-0, లక్ష్యం 193 పరుగులు
జడేజా వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 60 బంతుల్లో 105 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 36(29)
వెంకటేష్ అయ్యర్ 50(31)
జడేజా 2-0-25-0
------
9 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 72-0, లక్ష్యం 193 పరుగులు
బ్రేవో వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 66 బంతుల్లో 121 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 27(25)
వెంకటేష్ అయ్యర్ 43(29)
బ్రేవో 2-0-8-0
----
8 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 68-0, లక్ష్యం 193 పరుగులు
జడేజా వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 72 బంతుల్లో 125 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 25(23)
వెంకటేష్ అయ్యర్ 41(25)
జడేజా 1-0-9-0
----
ఏడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 59-0, లక్ష్యం 193 పరుగులు
డ్వేన్ బ్రేవో వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 78 బంతుల్లో 134 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 23(20)
వెంకటేష్ అయ్యర్ 34(22)
డ్వేన్ బ్రేవో 1-0-4-0
-------
పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 55-0, లక్ష్యం 193 పరుగులు
దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 84 బంతుల్లో 138 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 22(18)
వెంకటేష్ అయ్యర్ 31(18)
దీపక్ చాహర్ 3-0-23-0
------
ఐదు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 47-0, లక్ష్యం 193 పరుగులు
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. అయ్యర్ రెండు బౌండరీలు సాధించాడు. కోల్‌కతా విజయానికి 90 బంతుల్లో 146 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 16(15)
వెంకటేష్ అయ్యర్ 29(15)
శార్దూల్ ఠాకూర్ 1-0-11-0
-----
నాలుగు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 36-0, లక్ష్యం 193 పరుగులు
జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. గిల్, అయ్యర్ చెరో బౌండరీ సాధించారు. కోల్‌కతా విజయానికి 96 బంతుల్లో 158 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 13(11)
వెంకటేష్ అయ్యర్ 21(13)
జోష్ హజిల్‌వుడ్ 2-0-21-0
--------
మూడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 24-0, లక్ష్యం 193 పరుగులు
దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 102 బంతుల్లో 170 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 8(9)
వెంకటేష్ అయ్యర్ 15(9)
దీపక్ చాహర్ 2-0-15-0
-----
రెండు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 15-0, లక్ష్యం 193 పరుగులు
జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 108 బంతుల్లో 179 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 7(8)
వెంకటేష్ అయ్యర్ 7(4)
జోష్ హజిల్‌వుడ్ 1-0-9-0
------
మొదటి ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 6-0, కోల్‌కతా లక్ష్యం 193 పరుగులు
దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 114 బంతుల్లో 187 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 5(6)
వెంకటేష్ అయ్యర్ 0(0)
దీపక్ చాహర్ 1-0-6-0
-----
20 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 192-3, కోల్‌కతా లక్ష్యం 193 పరుగులు
శివం మావి వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. చివరి బంతికి ఫాఫ్ డుఫ్లెసిస్ అవుటయ్యాడు. కోల్‌కతా విజయానికి 120 బంతుల్లో 193 పరుగులు అవసరం.
మొయిన్ అలీ 37(20)
శివం మావి 4-0-32-1
ఫాఫ్ డుఫ్లెసిస్ (సి) వెంకటేష్ అయ్యర్ (బి) శివం మావి (86: 59 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు)
--------
19 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 185-2
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. మొయిన్ అలీ ఒక ఫోర్, సిక్సర్ కొట్టాడు.
మొయిన్ అలీ 35(18)
ఫాఫ్ డుఫ్లెసిస్ 81(55)
వరుణ్ చక్రవర్తి 4-0-38-0
-------
18 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 172-2
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో మొయిన్ అలీ ఒక ఫోర్ కొట్టగా, ఫాఫ్ డుఫ్లెసిస్ ఒక ఫోర్, సిక్సర్ కొట్టాడు.
మొయిన్ అలీ 23(13)
ఫాఫ్ డుఫ్లెసిస్ 80(54)
లోకి ఫెర్గూసన్ 4-0-56-0
------
17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 153-2
శివం మావి వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. ఓవర్ మొదటి, చివరి బంతులకు మొయిన్ అలీ సిక్సర్లు కొట్టాడు.
మొయిన్ అలీ 16(10)
ఫాఫ్ డుఫ్లెసిస్ 69(51)
శివం మావి 3-0-25-0
-------
16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 139-2
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి.
మొయిన్ అలీ 3(6)
ఫాఫ్ డుఫ్లెసిస్ 68(49)
లోకి ఫెర్గూసన్ 3-0-37-0
-----
15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 131-2
వెంకటేష్ అయ్యర్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి.
మొయిన్ అలీ 2(4)
ఫాఫ్ డుఫ్లెసిస్ 61(45)
వెంకటేష్ అయ్యర్ 1-0-5-0
------
14 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 125-2
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. రెండో బంతిని ఊతప్ప సిక్సర్ కొట్టి, మూడో బంతికి అవుటయ్యాడు.
మొయిన్ అలీ 1(1)
ఫాఫ్ డుఫ్లెసిస్ 57(42)
సునీల్ నరైన్ 4-0-26-2
రాబిన్ ఊతప్ప (ఎల్బీడబ్ల్యూ) (బి) సునీల్ నరైన్ (31: 15 బంతుల్లో, మూడు సిక్సర్లు)
------
13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 116-1
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. రెండో బంతిని ఊతప్ప సిక్సర్ కొట్టాడు.
రాబిన్ ఊతప్ప 25(13)
ఫాఫ్ డుఫ్లెసిస్ 56(39)
వరుణ్ చక్రవర్తి 3-0-25-0
-----
12 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 104-1
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి.
రాబిన్ ఊతప్ప 14(9)
ఫాఫ్ డుఫ్లెసిస్ 55(37)
సునీల్ నరైన్ 3-0-17-1
-------
11 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 97-1
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ఫాఫ్ డుఫ్లెసిస్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. దీంతో 35 బంతుల్లో తన అర్థ సెంచరీ పూర్తయింది.
రాబిన్ ఊతప్ప 10(5)
ఫాఫ్ డుఫ్లెసిస్ 52(35)
లోకి ఫెర్గూసన్ 2-0-29-0
------
10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 80-1
షకీబ్ అల్ హసన్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. రాబిన్ ఊతప్ప, ఫాఫ్ డుఫ్లెసిస్ చెరో సిక్సర్ కొట్టారు.
రాబిన్ ఊతప్ప 9(4)
ఫాఫ్ డుఫ్లెసిస్ 37(30)
షకీబ్ అల్ హసన్ 3-0-33-0
--------
తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 65-1
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి రుతురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు.
రాబిన్ ఊతప్ప 2(2)
ఫాఫ్ డుఫ్లెసిస్ 29(26)
సునీల్ నరైన్ 2-0-10-1
రుతురాజ్ గైక్వాడ్ (సి) శివం మావి (బి) సునీల్ నరైన్ (32: 27 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)
-----
ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 61-0
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి.
రుతురాజ్ గైక్వాడ్ 32(26)
ఫాఫ్ డుఫ్లెసిస్ 27(23)
వరుణ్ చక్రవర్తి 2-0-13-0
------
ఏడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 56-0
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి.
రుతురాజ్ గైక్వాడ్ 29(22)
ఫాఫ్ డుఫ్లెసిస్ 25(21)
సునీల్ నరైన్ 1-0-6-0
------
పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 50-0
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఐదో బంతిని డుఫ్లెసిస్ బౌండరీకి తరలించాడు.
రుతురాజ్ గైక్వాడ్ 26(19)
ఫాఫ్ డుఫ్లెసిస్ 22(18)
వరుణ్ చక్రవర్తి 1-0-8-0
-----
ఐదు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 42-0
శివం మావి వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఐదో బంతిని డుఫ్లెసిస్ బౌండరీకి తరలించాడు.
రుతురాజ్ గైక్వాడ్ 25(17)
ఫాఫ్ డుఫ్లెసిస్ 16(13)
శివం మావి 2-0-11-0
------
నాలుగు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 34-0
లోకీ ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి
రుతురాజ్ గైక్వాడ్ 23(14)
ఫాఫ్ డుఫ్లెసిస్ 10(10)
లోకీ ఫెర్గూసన్ 1-0-12-0
-------
మూడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 22-0
షకీబ్ అల్ హసన్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి
రుతురాజ్ గైక్వాడ్ 18(12)
ఫాఫ్ డుఫ్లెసిస్ 3(6)
శివం మావి 2-0-18-0
-------
రెండు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 9-0
శివం మావి వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి
రుతురాజ్ గైక్వాడ్ 7(8)
ఫాఫ్ డుఫ్లెసిస్ 2(4)
శివం మావి 1-0-3-0
-----
మొదటి ఓవర్ ముగిసేసరికి చెన్నై స్కోరు 6-0
షకీబ్ అల్ హసన్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి రుతురాజ్ గైక్వాడ్ బౌండరీ సాధించాడు.
రుతురాజ్ గైక్వాడ్ 5(4)
ఫాఫ్ డుఫ్లెసిస్ 1(2)
షకీబ్ అల్ హసన్ 1-0-6-0
-------
చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు
ఫాఫ్ డుఫ్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, మొయిన్ అలీ, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జోష్ హజిల్‌వుడ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టు
శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, లోకి ఫెర్గూసన్, శివం మావి
-------
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్
కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
---------
ఇన్ని రోజులు మనల్ని ఎంతగానో అలరించి, ఆనందాన్ని అందించిన ఐపీఎల్ నేటితో ముగియనుంది. టోర్నీ మొదటి నుంచి డామినేటింగ్ గేమ్‌తో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్, యూఏఈ వచ్చాక రూట్ మార్చి విజయాల బాట పట్టిన కోల్‌కతాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్ ఎవరు అంటే చెప్పడం కొంచెం కష్టమే. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుఫ్లెసిస్ తిరుగులేని ఫాంలో ఉన్నారు. వారిద్దరి తర్వాత మొయిన్ అలీ, రాయుడు, ఊతప్ప కూడా మంచి టచ్‌లో ఉన్నారు. క్వాలిఫయర్ మ్యాచ్‌లో ధోని ఫాంలోకి రావడం కూడా చెన్నైకి కలిసొచ్చే అంశం. జడేజా, బ్రేవో, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌లకు కూడా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. గొప్ప పేరున్న బౌలర్లు ఎవరూ చెన్నైలో లేరు. కానీ ఉన్న బౌలర్లు మాత్రం విశేషంగా రాణిస్తున్నారు. దీపక్ చాహర్, శార్దూల్, జడేజా, బ్రేవో, మొయిన్ అలీ.. ఇలా ఎవరి చేతికి బంతిని ఇచ్చినా వారు వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు.
కోల్‌కతా లీగ్ దశలో భారతదేశంలో ఏడు మ్యాచ్‌లు జరగ్గా అందులో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే కోల్‌కతా గెలిచింది. యూఏఈలో సెకండ్ లెగ్ ప్రారంభం అయ్యే సమయానికి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అయితే అక్కడ నుంచి కోల్‌కతా కమ్‌బ్యాక్ చేసిన విధానం మాత్రం హైలెట్. యూఏఈలో కోల్‌కతా తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఏడు విజయాలు సాధించింది. ఇందులో రెండు ప్లేఆప్స్ మ్యాచ్‌లు ఉన్నాయి.
కోల్‌కతా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్ తిరుగులేని ఫాంలో ఉన్నారు. మొదటి పది ఓవర్లలో వికెట్ ఇవ్వకుండా ఆడుతున్నారు. వెంకటేష్ అయ్యర్ యూఏఈలో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. వీరితో పాటు వన్‌డౌన్‌లో వస్తున్న రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా కూడా మంచి ఫాంలో ఉన్నారు. అవసరం అయినప్పుడు సునీల్ నరైన్ కూడా సిక్సర్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. అయితే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, మాజీ కెప్టెన్ దినేష్ కార్తీక్ వరుసగా విఫలం అవుతున్నారు.
ఇక కోల్‌కతా బౌలింగ్ కూడా ఎంతో బలంగా ఉంది. పేస్ బౌలర్లు శివం మావి, లోకి ఫెర్గూసన్ పరుగులను కట్టడి చేస్తూ ఉండగా.. మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌లు వికెట్లు తీస్తున్నారు. రసెల్ స్థానంలో జట్టులోకి వచ్చిన షకీబ్ అల్ హసన్ కూడా బౌలింగ్ బాగానే వేస్తున్నారు.