లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. చాలా మంది ప్రేక్షకులు ఓటీటీల్లో సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తారలు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేశారు. సమంత, కాజల్, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఓటీటీ ప్రాజెక్ట్స్ లో నటించారు. నటి ప్రియమణి కూడా 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. అయితే తొలిసారి ఆమె తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా' కోసం ఓ సినిమాలో నటిస్తోంది.
దీనికి 'భామాకలాపం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అభిమన్యు తడిమేటి అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సుధీర్ ఈదర, భోగవల్లి బాపినీడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో ప్రియమణి దుర్గాదేవిని పోలిన గృహిణిగా కనిపించింది.
దేవత మాదిరి ఎనిమిది చేతులతో కనిపించింది. తన చేతుల్లో కత్తి, కూరగాయల బుట్ట, బిరియానీ, చీపురు, గుడ్డు, గంట అలానే చేతిలో బైనాక్యులర్ పట్టుకొని చూస్తున్నట్లుగా కనిపించింది. పోస్టర్ ను బట్టి ఇదొక హౌస్ వైఫ్ స్టోరీ అని తెలుస్తోంది. కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. 'రాధేశ్యామ్' ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. దీపక్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. విప్లవ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా 'ఆహా' యాప్ లో విడుదల కానుంది.
Also Read: మెగా హీరో కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?
Also Read: సమంతతో విడాకులపై స్పందించిన చైతు.. ఇప్పుడు నేను హ్యాపీ..
Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
Also Read: ఇలా బెదిరిస్తే వచ్చి కొడతా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి 'రాధేశ్యామ్' డైరెక్టర్ వార్నింగ్..
Also Read: 22 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో రవితేజ.. ఈసారి ఎలాంటి హిట్ కొడతారో..?
Also Read: ఫూల్స్ డే రోజు మహేష్ రాడట.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?