మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీ పరిచయమయ్యారు వైష్ణవ్ తేజ్. ఆయన నటించిన 'ఉప్పెన' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాతోనే హిట్ అందుకోవడంతో.. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన' తరువాత క్రిష్ దర్శకత్వంలో 'కొండపొలం' అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కినా.. కమర్షియల్ గా మాత్రం వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతం ఈ హీరో తన మూడో సినిమాను మొదలుపెట్టారు.
తమిళంలో 'అర్జున్ రెడ్డి' సినిమాను రీమేక్ చేసిన దర్శకుడు గిరీశయ్య.. వైష్ణవ్ తేజ్ మూడో సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కేతిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కథ ప్రకారం సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ రాబోతుంది. జనవరి 13న వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు కానుకగా.. ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయబోతున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి 'రంగ రంగ వైభవంగా..' లేదా 'ఆబాల గోపాలం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. 'రంగ రంగ వైభవంగా..' అనే టైటిల్ కి చిత్రబృందం నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో దీన్నే ఫిక్స్ చేయాలని నిర్ణయించుకున్నారట. కథకి కూడా ఈ టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఇదే టైటిల్ తో రేపు పోస్టర్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
Also Read: సమంతతో విడాకులపై స్పందించిన చైతు.. ఇప్పుడు నేను హ్యాపీ..
Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
Also Read: ఇలా బెదిరిస్తే వచ్చి కొడతా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి 'రాధేశ్యామ్' డైరెక్టర్ వార్నింగ్..
Also Read: 22 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో రవితేజ.. ఈసారి ఎలాంటి హిట్ కొడతారో..?
Also Read: ఫూల్స్ డే రోజు మహేష్ రాడట.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?