అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్లకు ఈ జంట విడాకులు తీసుకోబోతున్నామంటూ ప్రకటించి షాకిచ్చింది. ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చైతు-సామ్ తమ విడాకుల విషయాన్ని ప్రకటించి మూడు నెలలు దాటినా.. ఇప్పటికీ ఈ డివోర్స్ మేటర్ వినిపిస్తూనే ఉంది. సమంత పలు సందర్భాల్లో ఈ విడాకుల విషయంపై స్పందించింది.
ఆ టైమ్ లో చచ్చిపోతానేమో అనుకున్నానని.. కానీ మరింత స్ట్రాంగ్ అయ్యానంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయంలో అందరూ తనను బ్లేమ్ చేస్తున్నా.. వెనుకడుగు వేయకుండా ముందుకు సాగిపోతుంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో కొన్ని కొటేషన్స్ ను షేర్ చేస్తూ.. తను మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నానంటూ నిరూపించే ప్రయత్నం చేస్తుంది.
సమంతతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పిన చైతు ఇప్పటివరకు ఎక్కడా ఈ విషయం గురించి నేరుగా మాట్లాడలేదు. తొలిసారి మీడియా ముందు తన డివోర్స్ విషయంపై స్పందించి వార్తల్లో నిలిచారు చైతు. ప్రస్తుతం ఈ హీరో నటించిన 'బంగార్రాజు' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చైతు.
ఈ క్రమంలో సమంతతో విడాకుల గురించి ప్రశ్నించగా.. 'ఇద్దరి మంచి కోసం తీసుకున్న డెసిషన్ అది. ఇప్పుడు నేను హ్యాపీ.. తను(సమంత) హ్యాపీ' అంటూ చెప్పుకొచ్చారు. చైతు తొలిసారి విడాకులపై స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. చాలా కూల్ గా చైతు సమాధానం చెప్పడంతో.. అతడు లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
Also Read: ఇలా బెదిరిస్తే వచ్చి కొడతా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి 'రాధేశ్యామ్' డైరెక్టర్ వార్నింగ్..
Also Read: 22 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో రవితేజ.. ఈసారి ఎలాంటి హిట్ కొడతారో..?
Also Read: ఫూల్స్ డే రోజు మహేష్ రాడట.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?