టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ పద్ధతిని మరోసారి సరిచూసుకోవాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అంటున్నాడు. అతడు ఎక్కువగా ఫ్రంట్ ఫుట్‌పై ఆధారపడుతున్నాడని పేర్కొన్నాడు. ఫలితంగా అతడు మరింత రక్షణాత్మకంగా ఆడాల్సి వస్తోందని వెల్లడించాడు. బ్యాక్‌ఫుట్‌పై ఆడితే కేప్‌టౌన్ టెస్టులో సెంచరీ చేసేవాడని అంచనా వేశాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో అతడు మాట్లాడాడు.
వెన్నునొప్పి తర్వాత విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగొచ్చాడు. సిరీసులో కీలకమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా బ్యాటర్లు విఫలమైన వేళ కోహ్లీ నిలబడ్డాడు. 201 బంతులాడి 12 బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 79 పరుగులు చేశాడు. 158 బంతుల్లో అతడు అర్ధశతకం అందుకోవడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ బ్యాటింగ్‌ను పరిశీలించిన మంజ్రేకర్ తన అభిప్రాయాన్ని అందరితో పంచుకున్నాడు.
Also Read: IPL New Sponsor: వివో ఔట్! ఇకపై 'టాటా ఐపీఎల్'! చైనా కంపెనీకి గుడ్‌బై!!
Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్ మెగా వేలం
'విరాట్ కోహ్లీ పరుగులు చేసే విధానాన్ని మారోసారి పరీక్షించుకోవాలి. కోహ్లీ ఆల్‌టైం గ్రేట్. ఎలా బ్యాటింగ్ చేయాలో అతడికెవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదన్న మాటలను నేను విశ్వసించను. ఎందుకంటే టెన్నిస్‌లో రోజర్ ఫెదరర్ గ్రేట్. కానీ అతడితో పాటు కోచ్ ఎప్పుడూ ఉంటాడు. మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు వివరిస్తూనే ఉంటాడు. అందుకే ప్రతి ఆటగాడికీ ఒక మార్గనిర్దేశకుడు కచ్చితంగా అవసరం. అలాంటి గైడ్ లేకపోవడంతో కోహ్లీ బ్యాటింగ్ సంక్లిష్టంగా మారుతోంది' అని సంజయ్ అన్నాడు.
ఒకప్పటిలా ఆడుంటే విరాట్ సులభంగా సెంచరీ అందుకోనేవాడని మంజ్రేకర్ అంటున్నాడు. 'అతడి అమ్ముల పొదిలో మరిన్ని షాట్లు ఉన్నాయి. భాగస్వాములు లేకపోవడంతో అతడు సెంచరీ చేయలేదని చాలామంది అంటున్నారు. కానీ ఒకప్పటిలా అతడు అన్ని రకాల షాట్లు ఆడుంటే ఇప్పుడు ఎదుర్కొన్న బంతులకే 130 చేసేవాడు. అతడు గతంలో ఆడినట్టుగానే ఆడాలని రాహుల్ ద్రవిడ్ సూచించాలి. ఆయన కన్నా మెరుగైన గైడ్ మరొకరు దొరకరు. ఫ్రంట్‌ఫుట్ మెథడ్‌ను పరీక్షించుకోవాలని చెప్పాలి. ఏదేమైనా కోహ్లీకి హ్యాట్సాఫ్! గడ్డు కాలం నుంచి అతడు బయటపడ్డాడు. కఠిన పరిస్థితుల్లో చక్కగా పరుగులు చేశాడు. నిజంగానే అతడికి భాగస్వాముల నుంచి మద్దతు దొరికతే సెంచరీ చేసేవాడే' అని పేర్కొన్నాడు.