అనగనగా ఓ దొంగ. ఉదయం తాళం వేసిన ఇళ్లను .. పెద్దగా జన సంచారం లేని ఇళ్లను మ్యాపింగ్ చేసుకుని రాత్రిిక పని పూర్తి చేస్తూ ఉంటాడు. అయితే అతనికో అలవాటు ఉంది. అదేమిటంటే .. తిండి. మంచి పుడ్ ఎక్కడైనా కనపించినా లేదా.. దొంగతనం చేస్తున్నప్పుడు తినాలనిపించినా వెంటనే కిచెన్‌లోకి వెళ్లి వండుకుని తినేస్తూ ఉంటాడు. ఈ అలవాటు  తాళం వేసిన ఇళ్లను కొల్లగొట్టేటప్పుడు చాలా సార్లు అమలు చేశాడు. సొత్తుతో పాటు కడుపు నింపుకుని వెళ్లాడు. కానీ కాలం అన్ని సార్లూ ఒకేలా ఉండదు. ఓ సారి మాత్రం దొరికిపోవాల్సి వచ్చింది. 


Also Read: మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా? ఉప్పే కాదు అంతకుమించి! ఈ షాకింగ్ విషయాలు చూడండి!


ఈ దొంగ కామెడీ సినిమాలో కమెడియన్ కాదు. నిజంగానే దొంగ. అస్సాం పోలీసుల పట్టుబడ్డాడు. తమ ఇంట్లో దొంగలు పడ్డారని అస్సాం పోలీసలకు మూడు రోజుల కిందట ఓ పోన్ కాల్ వచ్చింది. పోలీసులు వెళ్లే సరికి ఆ దొంగ అన్నీ చక్క బెట్టుకున్నా...  హాయిగా కిచెన్‌లో కిచిడి చేసుకుని తింటూ కనిపించాడు. దీంతో పోలీసులకు పెద్ద శ్రమ అవసరం లేకపోయింది. వెంటనే పట్టుకుని తీసుకెళ్లిపోయారు. ఈ విషయాన్ని క్రియేటివ్‌గా సోషల్ మీడియాలో తెలిపారు. 


Also read: వేడి చేస్తే తేనె విషంగా మారుతుందా? ఈ వాదనలో నిజమెంత?


" ఎన్ని ఆరోగ్య పరంగా ప్రయోజనాలు ఉన్నప్పటికీ ..  దొంగతనానికి వెళ్లి కిచిడి వంట వండుకుని తినాలనుకోవడం అంత మంచిది కాదు. దొంగను పట్టుకుని హాట్ మీల్స్ వడ్డిస్తున్నాం " అంటూ అస్సాం పోలీసులు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.  దొంగ వండుకున్న కిచిడీ ఫోటోను ట్వీట్ బ్యాక్‌గ్రౌండ్‌లో పోస్ట్ చేశారు పోలీసులు. 


 






Also read: పిల్ల మామూలుది కాదు, గుద్దితే చెట్లు విరగాల్సిందే... ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గర్ల్’ వీడియో చూడండి


పోలీసుల ట్వీట్‌ను నెటిజన్లు కూడా సరదాగా రిప్లయ్ ఇస్తున్నారు. ఈ అనుభవంతో ఈ సారి ఆ దొంగ.. "వర్కింగ్ టైం"లో వంట చేసుకోడని.. స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటారని ఒకరు ఫన్నీగా రిప్లయ్ ఇచ్చారు. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి