సల్మాన్ ఖాన్ 56వ పుట్టినరోజు సందర్భంగా బజరంగీ భాయిజాన్ సీక్వెల్ ను ప్రకటించారు. సల్లూ భాయ్ తన పుట్టినరోజురు డిసెంబర్ 27న ముంబైలోని పన్వేలి ఫామ్ హౌస్‌లో జరుపుకున్నారు. కరోనా కారణంగా ఆయన చాలా తక్కువ మంది మధ్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బజరంగీ భాయిజాన్ సీక్వెల్ టైటిల్ ప్రకటించారు. ఆ సినిమాకు ‘పవన్ పుత్ర భాయిజాన్’ అని పేరు ఖరారు చేసినట్టు చెప్పారు. మీడియా వాళ్లు మీరు రాజమౌళితో కలిసి పనిచేస్తారా? అని ప్రశ్నించగా, దానికి సల్మాన్ ‘నేను రాజమౌళితో ఏ సినిమా చేయడం లేదు, అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి పనిచేస్తున్నా కదా’ అని అన్నారు. బజరంగీ భాయిజాన్ సినిమాకు కథను అందించింది విజయేంద్ర ప్రసాద్. అలాగే సీక్వెల్ కు కూడా ఆయనే కథను అందించబోతున్నారు. ముంబైలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఇప్పటికే బజరంగీ భాయిజాన్ కు సీక్వెల్ ఉంటుందని సల్మాన్ ప్రకటించారు. కానీ టైటిల్ చెప్పలేదు.
వరుస సినిమాలు...
బజరంగీ భాయిజాన్‌తో పాటూ ‘నో ఎంట్రీ’ సినిమాకు కూడా సీక్వెల్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అలాగే మరో సినిమా టైగర్ 3 కూడా త్వరలో షూటింగ్ సెట్ మీదకు వెళ్లనున్నట్టు తెలిపారు. ఈ సినిమాలో కొత్త పెళ్లి కూతురు కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించబోతోంది.
బజరంగీ భాయిజాన్ 2015లో విడుదలైన సినిమా. అప్పట్లో అది చాలా పెద్ద హిట్ కొట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేసింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులకెక్కింది. ఈ సినిమా కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా సీక్వెల్ కథపై పనిచేస్తున్నట్టు ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ‘బజరంగీ భాయిజాన్ సీక్వెల్ గురించి సల్మాన్ ఖాన్ తో మాట్లాడాను. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది’అన్నారాయన.
Also Read: మహేష్ బాబుకు ఇష్టమైన కో-డైరెక్టర్... దర్శకుడిగా కోలీవుడ్‌లో సత్తా చాటాడోయ్!
Also Read: భీమ్లా నాయక్... పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ స్పెషల్ క్లైమాక్స్!
Also Read: నా చేతుల్లో ఏమీ లేదు... ఫ్యాన్స్‌కు క్షమాపణలు - 'భీమ్లా నాయక్' నిర్మాత
Also Read: అక్కినేని కాంపౌండ్‌లో సమంత... పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి!
Also Read: విడాకుల తర్వాత చనిపోతాననుకున్నా! కానీ... - సమంత
Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకులపై సమంత స్పందన
Also Read: సంపదకు సమంత ఇచ్చిన నిర్వచనం ఏంటంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి