అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత తన పరిస్థితిపై స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి పెదవి విప్పారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత కుంగిపోయి చనిపోతానని అనుకున్నారని తాజా ఇంటర్వ్యూలో ఆమె నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. జాతీయ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆమె... అభిమానుల నుంచి ఎదురైన విమర్శలు, ట్రోల్స్ మొదలుపెట్టి తన మానసిక పరిస్థితి గురించి కూడా ఏమాత్రం మనసులో దాచుకోకుండా వెల్లడించారు.
తనను తాను బలహీనురాలిగా భావించానని, నాగచైతన్యతో వేరు పడిన తర్వాత పరిస్థితులను ఎదుర్కొనే శక్తి తనకు లేదని అనుకున్నాని, వేరుపడ్డాక కుంగిపోయి మరణిస్తానని అనుకున్నానని సమంత తెలిపారు. ఆశ్చర్యంగా తాను శక్తివంతురాలిగా ఉన్నానని, ఇప్పటి తన పరిస్థితి చూసి తనకు గర్వంగా ఉందని ఆమె అన్నారు. జీవితం గురించీ సమంత మాట్లాడారు.
"మన రోజు బాలేకపోతే... ఓకే. దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని, అంగీకరించి ముందుకు వెళితే... సగం పని పూర్తయినట్టే. పరిస్థితిని అంగీకరించకుండా ముందుకు వెళితే... ఎప్పటికీ పూర్తికాని యుద్ధంలో పోరాటం చేస్తున్నట్టే ఉంటుంది. అలా కాకుండా 'ఇది నా సమస్య? ఇప్పుడు ఏంటి? ఇంకా నా జీవితాన్ని జీవించాలి' అని గుర్తించినప్పుడు... నాకు తెలుసు, నా బతుకు నేను బతుకుతా. నా వ్యకిగత జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు అన్నిటితో నా జీవితాన్ని నేను జీవిస్తా. నేను ఎంత స్ట్రాంగ్ అనేది తెలుసుకుని నేనే స‌ర్‌ప్రైజ్ అయ్యా" అని సమంత పేర్కొన్నారు.
Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన
సినిమాలకు వస్తే... వచ్చే ఏడాది సమంత నటించిన 'శాకుంతలం' విడుదల కానుంది. ఆ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తి చేసిన సమంత, సోమవారం 'యశోద' (Yashoda Movie) చిత్రీకరణ ప్రారంభించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ శేఖర్ నిర్మాణంలో ఓ తమిళ, తెలుగు సినిమా చేయనున్నారు. 



Also Read: నెల రాజుని... ఇల రాణిని... కలిపింది కదా 'సిరివెన్నెల'! ఆయన చివరి సంతకం విన్నారా?
Also Read: డెసిషన్ మారలేదు... పుకార్లకు మరోసారి చెక్ పెట్టిన 'భీమ్లా నాయక్' ప్రొడ్యూసర్
Also Read: బాలకృష్ణ, బోయపాటి కాంబినేష‌న్‌లో డ‌బుల్ హ్యాట్రిక్‌కు సన్నాహాలు?
Also Read: యంగ్ హీరోకి టైటిల్ కష్టాలు.. రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోన్న నిర్మాత..
Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి