పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో ఆయన కుమారుడు ఆకాష్ పూరి నటించాడు. బాల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. విజయవంతమైన సినిమాల్లో నటించాడు. కానీ, హీరోగా హిట్ సినిమా అతని ఖాతాలో ఇంకా పడలేదు. కుమారుడి కోసం పూరి 'మెహబూబా' తీశాడు. హీరోగా పరిచయం చేశాడు. అయితే, ఆ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు. అంతకు ముందు 'ఆంధ్రాపోరి'లోనూ ఆకాష్ పూరి నటించాడు. అదీ ఆడలేదు. ఇప్పుడు 'రొమాంటిక్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పూరి జగన్నాథ్ మార్క్ కథ, కథనం, సంభాషణలతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రొమాన్స్ ఒక రేంజ్ లో ఉందని ట్రైలర్లు చూస్తే తెలుస్తోంది. పూరి కుమారుడు ఆకాష్ కూడా అదే అనుకున్నాడట.


Also Read: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!


నాన్న దగ్గరకు వెళ్లి రొమాన్స్ కొంచెం తగ్గించమని అడిగానని, 'సినిమా పేరే రొమాంటిక్. అందులో రొమాన్స్ తగ్గించమని అంటావ్ ఏంట్రా' అని చెప్పడంతో సైలెంట్ ఆయ్యానని ఆకాష్ పూరి తెలిపారు. రొమాన్స్ చేయడం చాలా కష్టమని, అది చేయలేక సెట్ లో చాలాసార్లు భయం వేసిందని, ఒకానొక దశలో పారిపోదామని అనుకున్నాని ఆకాష్ పూరి వివరించాడు. రొమాంటిక్ టైటిల్ కాబట్టి ట్రైలర్లు రొమాంటిక్ గా కట్ చేశామని... సినిమాలో ఎమోషనల్ కంటెంట్, యాక్షన్ సీన్లు చాలా ఉన్నాయని అతడు తెలిపాడు. సినిమా విడుదలైన తర్వాత మౌత్ టాక్ ద్వారా కంటెంట్ జనాల్లోకి బలంగా వెళ్తుందనే నమ్మకం ఉందన్నాడు.


ఇంకా ఆకాష్ పూరి మాట్లాడుతూ "ఒక రోజు నాన్న సడెన్‌గా పిలిచి 'ఈ సినిమాకు నువ్వు హీరో. అనిల్ దర్శకుడు' అని మాతో చెప్పారు. మేమిద్దరం షాక‌య్యాం. ఈ కథ నాన్న దగ్గర ఎప్పటినుండో ఉంది. నేనే ఈ కథలోకి వచ్చా. 'ఇస్మార్ట్ శంకర్', 'రొమాంటిక్' చిత్రీకరణ ఒకే సమయంలో జరిగాయి. ఇస్మార్ట్ పెద్ద హిట్ అవ్వడంతో రొమాంటిక్ ఇంకా బాగా తీయాలనుకున్నాం. అప్పుడు రమ్యకృష్ణగారిని తీసుకున్నాం. ఆవిడ రాకతో సినిమా స్థాయి మారింది" అని చెప్పాడు. సక్సెస్ కొట్టిన తర్వాత మళ్లీ తండ్రి దర్శకత్వంలో సినిమా చేస్తానని అన్నాడు.


Also Read: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?


ఓ పదేళ్ల తర్వాత దర్శకత్వం చేయాలనుందని ఆకాష్ పూరి తెలిపాడు. అయితే, తనకు కథ రాయడం రాదని... తన తండ్రికి డబ్బులిచ్చి కథ తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. హీరోగా నిలబడిన తర్వాత డైరెక్షన్ చేస్తాడట. "నాకు రజినీకాంత్, చిరంజీవి దేవుళ్లతో సమానం. వారిద్దరి సినిమాలు ఎక్కువగా చూస్తాను" అని ఆకాష్ చెప్పాడు.


Also Read: వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని... తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని అంటున్న చిరంజీవి!


Also Read: సర్కారు వారి పాట... ఇంతే ఒక వెయ్యి... లీకయ్యిందిగా!


Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి