కాళోజి హెల్త్ యూనివర్సిటీ ,  బీఎస్సీ అలాయిడ్ హెల్త్  సైన్సెస్  డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు  దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ అనుమతితో  పలు  నూతన కోర్సులను ఈ ఏడాది కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం  ప్రవేశ పెట్టింది. గతంలో ఉన్న బీఎస్సీ (ఎంఎల్‌టీ) కోర్సుతోపాటు నూతనంగా ప్రవేశపెట్టిన కోర్సులకు జనవరి 1 నుంచి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం తుది మెరిట్ జాబితాను అధికారులు విడుదల చేస్తారు. 


పోస్టుల వివరాలు...


➥ బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ


➥ బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ


➥ బీఎస్సీ కార్డియాక్ & కార్డియో  వాస్క్యూలర్  టెక్నాలజీ


➥ బీఎస్సీ రెనాల్  డయాలిసిస్  టెక్నాలజీ


➥ బీఎస్సీ ఆప్టోమెట్రీ


➥ బీఎస్సీ రెస్పిరేటరీ  థెరపీ  టెక్నాలజీ 


➥బీఎస్సీ న్యూరో  సైన్స్  టెక్నాలజీ


➥బీఎస్సీ క్రిటికల్  కేర్  టెక్నాలజీ


➥బీఎస్సీ రేడియాలజీ  & ఇమేజింగ్  టెక్నాలజీ


➥ బీఎస్సీ ఆడియోలజీ & స్పీచ్  థెరపీ టెక్నాలజీ


➥ బీఎస్సీ మెడికల్  రికార్డ్స్ సైన్సెస్


➥ బీఎస్సీ న్యూక్లియర్  మెడిసిన్


➥ బీఎస్సీ రేడియో థెరపీ టెక్నాలజీ    


అర్హత: ఇంటర్మీడియట్ (బైపీసీ) లేదా బ్రిడ్జ్ కోర్సు ఇంటర్మీడియట్ (బయాలజీ, ఫిజికల్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.


వయసు: 31.122022 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.


కోర్సు వ్యవధి: ఏడాది ఇంటర్న్‌షిప్‌తో సహా నాలుగేళ్లు.


రిజిస్ట్రేషన్ ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.2500; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2000.


ఎంపిక ప్రక్రియ: ఇంటర్ మార్కులు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఎంపిక చేస్తారు.


ఆన్‌లైన్ దరఖాస్తు, సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయడానికి చివరితేదీ: 10.01.2023.


Notification


PROSPECTUS


Online Application


Also Read:


'ఇంటర్‌' అర్హతతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు! వీరికి మాత్రమే ప్రత్యేకం!
తెలంగాణలో ఇక ఇంటర్ పూర్తయిన విద్యార్థులు కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసే వెసులుబాటు రాబోతుంది. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకొనే విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయిలోనే అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రతీ సంవత్సరం 20 వేల మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


TS SET - 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్) - 2022 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 30న ప్రారంభమైంది. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు, ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జనవరి 20 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, ఫిబ్రవరి 5 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.2000; బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్‌ఐ, ఓహెచ్, ట్రాన్స్‌జెండర్‌లు రూ.1000 చెల్లించాలి. 2023 మార్చి మొదటి లేదా రెండోవారంలో ఆన్‌లైన్ విధానంలో టీఎస్ సెట్-2022 పరీక్షలను నిర్వహించనున్నారు.
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


యూజీసీనెట్ 2022 దరఖాస్తు ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి! చివరితేది ఇదే!
దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు)-2022 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 29న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు జనవరి 17 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...