తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్) - 2022 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం (డిసెంబరు 30) ప్రారంభమైంది. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు, ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జనవరి 20 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, ఫిబ్రవరి 5 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.2000; బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్‌ఐ, ఓహెచ్, ట్రాన్స్‌జెండర్‌లు రూ.1000 చెల్లించాలి. 2023 మార్చి మొదటి లేదా రెండోవారంలో ఆన్‌లైన్ విధానంలో టీఎస్ సెట్-2022 పరీక్షలను నిర్వహించనున్నారు.

TS SET 2022 Online Application

వివరాలు..

↪ టీఎస్ సెట్-2022 (TS SET-2022)

సబ్జెక్టులు: జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ (ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్(సీఎస్ఈ, ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

పరీక్ష ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.2000; బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్‌ఐ, ఓహెచ్, ట్రాన్స్‌జెండర్‌లు రూ.1000 చెల్లించాలి.

ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష (టీఎస్ సెట్) ద్వారా.

పరీక్ష విధానం: మొత్తం 29 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. 

పరీక్ష సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, విజయవాడ, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం.

Notification
Website 

ముఖ్యమైన తేదీలు..

టీఎస్ సెట్ 2022 నోటిఫికేషన్ 23-12-2022.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 30-12-2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది (ఆలస్యరుసుము లేకుండా) 20-01-2023.
రూ.1500 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది 25-01-2023.
రూ.2000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది 31-01-2023.
రూ.3000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది  05-02-2023.
దరఖాస్తుల సవరణకు అవకాశం 2023, ఫిబ్రవరి 6, 7 తేదీల్లో.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ 2023, ఫిబ్రవరి చివరివారంలో
పరీక్ష తేది 2023, మార్చి మొదటి లేదా రెండోవారంలో

Also Read:

యూజీసీనెట్ 2022 దరఖాస్తు ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి! చివరితేది ఇదే!
దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు)-2022 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 29న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు జనవరి 17 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. 
దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


సీయూఈటీ పీజీ ప్రవేశ పరీక్ష షెడ్యూలు విడుదల, పరీక్ష తేదీలివే!
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌ (సీయూఈటీ) తేదీలను యూజీసీ ఖరారు చేసింది. సీయూఈటీ పరీక్షలు 2023, జూన్‌ 1 నుంచి 10 రోజుల పాటు జరుగనున్నట్లు తెలిపింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ డిసెంబరు 29న ప్రకటించారు. దేశంలోని అన్ని కేంద్రీయ  విశ్వవిద్యాలయాల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. సెంట్రల్‌ యూనివర్శిటీల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం కామన్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ 2023 మార్చి నెల రెండో వారం నుంచి ప్రారంభమవుతుంది.
సీయూఈటీ పీజీ పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...