వేద ఉయ్యాల ఊగుతూ కిందపడిపోతుంది. కాసేపటికి స్పృహ వచ్చిన తర్వాత తనకి గతం మర్చిపోయినట్టు మాట్లాడుతుంది. యష్ వేద ఎలా ఉంది ఏమైంది అని కంగారు పడతాడు. నేను నీ భర్తని అని యష్ అంటుంటే వేద మాత్రం ఏమి గుర్తులేనట్టు తనతో కోపంగా మాట్లాడుతుంది.
యష్: నేను నీ భర్త యశోధర్ ని
వేద: నన్ను మోసం చెయ్యడానికి ఇది కొత్త డ్రామానా
యష్: నేను చెప్పేది నిజం.. మిస్టర్ యారగెంట్ ని
వేద: నిన్ను చూస్తుంటే ఛీటర్ లాగా ఉన్నావ్
యష్: నన్ను నువ్వు ముద్దుగా పిలుచుకుంటావ్
వేద; నేను ఎవరో నాకు తెలియకపోయినా నష్టం లేదు కానీ నీలాంటి వాళ్ళని నేను నమ్మను
యష్: నేను చెప్పేది నిజం మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఉయ్యాల ఊగుతూ నువ్వు కిందపడిపోయావ్. సడెన్ గా ఏమైందో ఏమో నువ్వు నన్ను గుర్తుపట్టడం లేదు
వేద: ఇదంతా నేను ఎందుకు నమ్మాలి
యష్: తనని నమ్మించడం కోసం ఫోన్లో ఉన్న వాళ్ళ ఫోటోస్ చూపిస్తాడు. ఖుషి మన కూతురు అందరికంటే తనే నీకు ఎక్కువ ఇష్టం కదా అని చెప్తాడు. ఎంతకీ వేద గుర్తుపట్టకపోయేసరికి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అప్పుడు వేద ఏవండీ అని పిలుస్తుంది.
Also Read: ఊహించని ట్విస్ట్, గతం మర్చిపోయిన వేద- షాక్లో యష్, రగిలిపోతున్న మాళవిక
వేద: ఈ ప్రపంచంలో నన్ను నేను మర్చిపోతాను ఏమో కానీ మిమ్మల్ని, నా బంగారుతల్లిని మర్చిపోను. అలా వచ్చిందంటే అది నా జీవితంలో ఆఖరి రోజు. ఇందాక పుట్ట దగ్గర నా ప్లేస్ లో ఎవరు ఉన్నా ఇలాగే రియాక్ట్ అవుతా అన్నారు. మరి ఇప్పుడు నా ప్లేస్ లో ఉన్న ఇలాగే రియాక్ట్ అవుతారా అని సోరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే
ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తు వేద ఆగి పగలబడి నవ్వుతుంది. అది చూసి ఏమైంది అలా నవ్వుతున్నావ్ మళ్ళీ మైండ్ పోయిందా అని యష్ బిక్కమొహం వేసి అడుగుతాడు. యష్ బతిమలాడటం గుర్తు చేసుకుని నవ్వుతూ ఉంటే యష్ తన వెంట పడతాడు. ఒక మంచి సాంగ్ వేసి ఆ సీన్ సూపర్ గా చూపించేశారు. పొలం గట్టు మీద నుంచి వేద కింద పడిపోతూ యష్ ని కూడా పడేస్తుంది.
అభిమన్యుకి పెళ్లి సంబంధాలు తీసుకుని ఒక వ్యక్తి వస్తాడు. వెంటనే మాళవిక కోపంగా వచ్చి అతన్ని వెళ్లిపొమ్మని చెప్తుంది. పెళ్ళికి సిద్ధపడ్డారా అభిమన్యు సర్, లేదంటే ఇద్దరు పిల్లల తల్లిని లొంగదీసుకుని ఈ ఇంట్లో ఉంచుకున్నారా? అలాంటిది ఏమి లేదు కదా మీ జీవితంలో ఏ అమ్మాయికి చోటు లేదు కదా అని వెటకారంగా అడుగుతుంది. పెళ్లి విషయంలో మీ సొంత డెసిషన్ ఎందుకు మీ అక్కమ్మ నిర్ణయం ఆలో అవరా అని అడుగుతుంది. మాళవిక గురించి భ్రమరాంబిక మొత్తం చెప్తుంది. మాళవిక 24 క్యారెట్ల గోల్డ్, నోరు విప్పితే ఒక మర్యాద అని భ్రమరాంబిక తెగ మెచ్చుకుంటుంది. తన గురించి తెగ పొగిడేసిందని భ్రమరాంబిక పొంగిపోతుంది. టచ్ చేశావ్ బంగారం అని మాళవికని మెచ్చుకుని తన మెడలోని గొలుసు పెడుతుంది.
Also Read: తులసి కోసం చెయ్యి కాల్చుకున్న సామ్రాట్- శ్రుతి కడుపు పోతుందా?
అది చూసి అభిమన్యు, ఖైలాష్ బిత్తరపోతారు. సులోచన, మాలిని రాణికి ఫోన్ చేసి వేద వాళ్ళ గురించి అడుగుతారు. వేద, యష్ మధ్య ఉంది ఎన్నెన్నో జన్మలబంధం అని రాణి, రాజా మెచ్చుకుంటారు. వేద, యష్ తమకి అంటుకున్న బురద శుభ్రం చేసుకుంటూ ఉంటారు. వేదని చూసి యష్ దిస్టీ తీయించుకో అని పొగుడుతాడు. ఆ మాటకి వేద సిగ్గు మొగ్గలేస్తుంది.