రాజా రాణిని పిలిచి మగాడు పెళ్లి చేసుకునేందుకు ఎందుకో తెలుసా అని అడుగుతాడు. ఎందుకు అంటే వీపు గోకించుకోవడానికి అని సరదాగా సమాధానం ఇస్తాడు. అప్పుడే వేద, యష్ ఊరు చూడటానికి వెళ్ళడానికి రెడీ అయ్యాం అని వస్తారు. మనవడా వేదతో ఎప్పుడైనా వీపు గోకించుకున్నావా అని కాసేపు క్లాస్ తీసుకుంటాడు. రాణి అడ్డుపడి ఆపండి మీ గోకుడు పురాణం అని వేద వాళ్ళని వెళ్ళమని చెప్తుంది. మాళవిక వేద మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ రగిలిపోతుంది.
Also Read: తులసి కోసం చెయ్యి కాల్చుకున్న సామ్రాట్- శ్రుతి కడుపు పోతుందా?
‘వేద నాకు కాల్ చేసి నిప్పులు చిమ్ముతుందా? ఎక్కడిది వేదకి ఈ ధైర్యం, తెగింపు. ఒక వేళ వేద మందు పెట్టి యశోధర్ ని లొంగదీసుకుందా? ఇద్దరూ కాపురం చేశారా? ఆదిత్యని ఎరగా చూపించి యశోధర్ ని లొంగదీసుకుని వాళ్ళ మధ్య చిచ్చు పెడదాం అనుకున్నా కానీ నా ప్లాన్ ఫెయిల్ అయినట్టేనా. యష్ వేదకి శారీరకంగా కూడా దగ్గర అయ్యాడా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? వేద నా మీద గెలిచినట్టా’ అని రగిలిపోతుంది. వేద, యష్ బుల్లెట్ మీద ఊరు చూడటానికి వస్తారు. అప్పుడే చిత్ర మిస్డ్ కాల్ చూసి వేద తిరిగి చేస్తుంది. పల్లెటూరు చూస్తాను అనేసరికి ఖుషికి వీడియో కాల్ చేసి చూపిస్తుంది. బంగర్రాజు గెటప్ లో సూపర్ గా ఉన్నావ్ డాడీ అని ఖుషి మెచ్చుకుంటుంది.
వేద, యష్ దూరం దూరంగా నిలబడి ఫోన్ మాట్లాడుతుంటే ఖుషి వాళ్ళని దగ్గరకి నిలబడి అమ్మ మీద చెయ్యి వేయమని చెప్తుంది. తర్వాత వేద సంతోషంగా ఊరు అంతా చూపించిన తర్వాత పెట్టేస్తుంది. ఖుషితో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉందని వేద అంటుంది. ఖుషిని బాగా చూసుకుంటున్నందుకు యష్ వేదకి థాంక్స్ చెప్తాడు. పుట్ట దగ్గర వేద యశోధర్ ని దణ్ణం పెట్టుకోమని చెప్తుంది. పుట్టలో చెయ్యి పెట్టు పాము కరవకపోతే అప్పుడు నాగులతల్లి ఉందని నమ్ముతాను అని యశోధర్ అంటాడు. వేద పుట్టలో చెయ్యి పెట్టి పాము కరిచినట్టు నటిస్తుంది. దీంతో యష్ కంగారుపడతాడు. తర్వాత పాము కరవలేదు నాగుల తల్లి దీవిస్తుందని వేద చెప్పేసరికి యష్ కూడా దణ్ణం పెట్టుకుంటాడు. ఎప్పుడు లేనిది తన మీద అంత కన్సన్ ఎందుకు చూపించారని వేద అడుగుతుంది.
Also Read: భార్యాభర్తల చిలిపి సరసాలు- మాళవికకి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన వేద
నీ ప్లేస్ లో ఎవరు ఉన్నా ఇలాగే రియాక్ట్ అవుతాను అని యష్ అనేసరికి వేద చిన్నబుచ్చుకుంటుంది. తర్వాత వేద ఉయ్యాల ఊగుతూ పొరపాటున జారి కింద పడి స్పృహ తప్పిపోతుంది. వేదకి ఏమైందా అని యష్ కంగారుపడతాడు. నీళ్ళు తెచ్చి మొహాన కొట్టగానే వేద లేచి విచిత్రంగా చూస్తుంది. వేద మీద చెయ్యి వేసి బాగానే ఉన్నవా అని యష్ అడుగుతాడు. చెయ్యి విదిలించి ఎవరు నువ్వు అని వేద అడిగేసరికి యష్ షాక్ అవుతాడు. వేద ఏమైంది నీకు అని టెన్షన్ గా అడుగుతాడు. వేద ఎవరు అని వేద అమాయకంగా అడుగుతుంది. నీ పేరే వేద, నేను నీ భర్త యశోధర్ ని అని అంటాడు. షటప్ నువ్వు నా హజ్బెండ్ ఏంటి అని వేద కోపంగా అంటుంది.