జ్ఞానంబ, గోవిందరాజులు పూజ చేసిన కలశం ఇంటికి తీసుకుని వస్తారు. ఇంటి మధ్యలో ఈ కలశం ఎందుకు పెట్టారని మల్లిక జ్ఞానంబని అడుగుతుంది. ఇంటికి ఏదైనా దిష్టి ఉంటే తొలగిపోవడానికి దాన్ని అక్కడ పెట్టినట్టు జ్ఞానంబ చెప్తుంది. గుళ్ళో మొక్కు కోసం కొట్టిన కొబ్బరి కాయ కుళ్లిపోయింది, ఇలా చేస్తే దోషాలు, అరిష్టాలు తొలగిపోతాయని పూజారి చెప్పారు అందుకే ఇలా చేశానని జ్ఞానంబ చెప్తుంది. కాయ చెడిపోతే ఇదంతా ఎందుకని అఖిల్ అంటాడు. కొన్ని చెడు విషయాలు జరగడానికి ముందు సంకేతంగా ఇలా అవుతుందని గోవిందరాజులు అంటాడు. జరిగిన పరిణామాలు తలుచుకుని జాగ్రత్త పాడాలని జ్ఞానంబ జెస్సి గురించి కంగారుగా అంటుంది.


Also Read: తులసి కోసం చెయ్యి కాల్చుకున్న సామ్రాట్- శ్రుతి కడుపు పోతుందా?


జెస్సికి పుట్టబోయే బిడ్డ గురించి జ్ఞానంబ భయపడుతుందని జానకి మనసులో అనుకుంటుంది. ఇంట్లో వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా ఉండటం కోసం ఎటువంటిది అయినా నమ్ముతాను అని జ్ఞానంబ దంపతులు బాధగా వెళ్ళిపోతారు. అత్తయ్యగారి బాధ అర్థం చేసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని జానకి కూడా మల్లికని ఇన్ డైరెక్ట్ గా హెచ్చరిస్తుంది. తర్వాత జెస్సికి జాగ్రత్తలు చెప్తుంది. మళ్ళీ ఈ అరిష్టం ఏంటి? వస్తే ఏ రూపంలో వస్తుంది అని జానకి మనసులోనే కంగారుపడుతుంది. అటు మల్లిక కూడా ఏమైందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే విషయం చికితతో చెప్తుంది. కొబ్బరి కాయ చెడిపోయినా, ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ పాడైపోయినా అరిష్టం అని చాలా మంది చెప్పారని చికిత కూడా చెప్తుంది.


అప్పుడే ఇంటి పత్రాలు తాకట్టు పెట్టుకున్న వడ్డీ వ్యాపారి ఎంట్రీ ఇస్తాడు. ఆయనకి మల్లిక ఎదురుపడి ఏం కావాలని అడుగుతుంది. రామా ఉన్నాడా అని అడుగుతాడు. లేదు బయటకి వెళ్లాడని చెప్తుంది. రామా దగ్గర సంతకాలు తీసుకోవడానికి వచ్చినట్టు వడ్డీ వ్యాపారి చెప్తాడు. ఇదేదో తెలుసుకోవాల్సిన విషయం ఉందని మల్లిక అనుకుంటుంది. రామాకి డబ్బు అవసరం అయితే తన దగ్గర తీసుకున్నాడని వడ్డీ వ్యాపారి చెప్తాడు. ఎంత అప్పు తీసుకున్నారని మల్లిక అడుగుతుంది. రూ.20 లక్షలు అప్పు తీసుకున్నాడని ఆయన చెప్పేసరికి మల్లిక నోరెళ్ళబెడుతుంది. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అంత అప్పు ఎందుకు తీసుకున్నాడని అడుగుతుంది. ఇంటి పత్రాలు హామీగా పెట్టి డబ్బులు తీసుకున్నాడని మల్లికకి ఆయన చెప్తుంది.


Also Read: భార్యాభర్తల చిలిపి సరసాలు- మాళవికకి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన వేద


ఇది అడ్డం పెట్టుకుని ఇంటిని నాలుగు ముక్కలు చేసి బయటకి వెళ్లవచ్చని మల్లిక మనసులో అనుకుంటుంది. ఇల్లు మా అత్తయ్య పేరు మీద ఉంది అని చెప్పి ఆయన్ని బలవంతంగా ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. ఇంట్లో అందరీని పిలుస్తుంది మల్లిక. వడ్డీ వ్యాపారి భాస్కర్ రామా చేసిన అప్పుకి సంతకం తీసుకోవడానికి వచ్చినట్టు చెప్తాడు. అది విని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. రామా ఏం అవసరం వచ్చిందో అని ఆలోచిస్తూ ఉంటే మల్లిక పుల్లలు వేస్తుంది. బాగా అవసరం ఉందని రూ.20 లక్షలు తీసుకున్నాడాని భాస్కర్ చెప్పేసరికి మల్లిక ఏమి తెలియని దానిలా కూలబడిపోతుంది. అంత డబ్బు ఎందుకు తీసుకున్నారని ఇంట్లో అడుగుతారు. ఏం పెట్టి తీసుకున్నాడని గోవిందరాజులు అడుగుతాడు. ఇంటి కాగితాలు పెట్టి తీసుకున్నాడని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.