కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌ (సీయూఈటీ) తేదీలను యూజీసీ ఖరారు చేసింది. సీయూఈటీ పరీక్షలు 2023, జూన్‌ 1 నుంచి 10 రోజుల పాటు జరుగనున్నట్లు తెలిపింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ డిసెంబరు 29న ప్రకటించారు. దేశంలోని అన్ని కేంద్రీయ  విశ్వవిద్యాలయాల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు.


సెంట్రల్‌ యూనివర్శిటీల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం కామన్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ 2023 మార్చి నెల రెండో వారం నుంచి ప్రారంభమవుతుంది. కాగా, ఫలితాలను జూలై 1 న ప్రకటించేందుకు అధికారులు ప్లాన్ చేశారు. సెంట్రల్ కామన్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నది. అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లో సంప్రదించాలి.


అస్సామీ, బెంగాలీ, ఇంగ్లిష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 1,000 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. 450-500 పరీక్షా కేంద్రాలను నిత్యం వాడేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, తదుపరి సెషన్ నుంచి మరిన్ని ప్రైవేట్, ప్రభుత్వ, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఈ ప్రవేశ పరీక్షలో పాల్గొంటాయని యూజీసీ విశ్వసిస్తున్నది.





Also Read:


యూజీసీ నెట్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
యూజీసీ - నెట్ (UGC-NET) డిసెంబర్-2022 పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను ఫిబ్రవరి 23 నుంచి మార్చి 10వరకు నిర్వహించనున్నట్టు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ వెల్లడించారు. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షకు డిసెంబర్ 29 నుంచి జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జగదీశ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 23 నుంచి మార్చి 10వరకు జరగనుందని తెలిపారు. అభ్యర్థులందరికీ ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.. 


సీఆర్‌పీఎఫ్‌లో 1458 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఈ అర్హతలుండాలి!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టులు, 1315 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉన్న యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భ ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 4న ప్రారంభమై 25న ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...