తెలంగాణలో 'గ్రూప్-2' నోటిఫికేష‌న్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల‌కు ప్రభుత్వం శుభ‌వార్త‌ తెలిపింది. కొత్త సంవత్సరం కానుకగా అన్నట్లు 783 పోస్టుల‌తో 'గ్రూప్ -2' నోటిఫికేష‌న్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి జ‌న‌వ‌రి 18 నుంచి  ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కమిషనర్‌ గ్రేడ్‌-3, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌, డిప్యూటీ తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2, జూనియర్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.


తెలంగాణలో 'గ్రూప్-2' నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాలు ఇలా!



ఇప్ప‌టికే గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేష‌న్లు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫ‌లితాలు కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్నాయి. ఇక గ్రూప్-4 నోటిఫికేష‌న్‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ కూడా త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. హాస్ట‌ల్ వార్డెన్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది. హార్టిక‌ల్చ‌ర్, వెట‌ర్న‌రీ శాఖ‌ల్లో కూడా కొలువుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ్డాయి. మ‌రోవైపు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌క్రియ కొన‌సాగిస్తోంది. పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌లో భాగంగా ఫిజిక‌ల్ ఈవెంట్స్ కొన‌సాగుతున్నాయి. మొత్తంగా తెలంగాణ‌లో కొలువుల జాత‌ర కొన‌సాగుతోంది.


ఇక గ్రూప్-3 వంతు!


తెలంగాణలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ వెలువడంతో.. ఇక గ్రూప్-3 నోటిఫికేషన్ వెల్లడికి కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబరు 31 లేదా జనవరి మొదటివారంలో గ్రూప్-3 నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. గ్రూప్‌-3 కింద అనుమతించిన 1,373 పోస్టులకు అదనంగా మరో వందకు పైగా చేరనున్నాయి. దీనితోపాటు 1000 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్స్ (ఎఫ్‌బీవో) పోస్టులు, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు సంబంధించిన ప్రకటనలు కూడా ఈ నెలాఖరులోగా వెలువరించనున్నారు.


 


Also Read:


తెలంగాణలో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, జీతమెంతో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ విభాగాల్లో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు, ప్రారంభ జీతం రూ.50 వేలకు పైమాటే!
తెలంగాణ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ విభాగంలో ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...