యూజీసీ - నెట్ (UGC-NET) డిసెంబర్-2022 పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను ఫిబ్రవరి 23 నుంచి మార్చి 10వరకు నిర్వహించనున్నట్టు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ వెల్లడించారు. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షకు డిసెంబర్ 29 నుంచి జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జగదీశ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 23 నుంచి మార్చి 10వరకు జరగనుందని తెలిపారు. అభ్యర్థులందరికీ ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.


















Also Read:


సీఆర్‌పీఎఫ్‌లో 1458 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఈ అర్హతలుండాలి!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టులు, 1315 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉన్న యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భ ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 4న ప్రారంభమై 25న ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎస్‌బీఐలో 1438 ఉద్యోగాలు, వీరికి బంపరాఫర్! నెలకు రూ.40 వేల వరకు జీతం!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కలెక్షన్ ఫెసిలిటేటర్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. డిసెంబర్ 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. 2023, జనవరి 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయిలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారు బ్యాంక్ క్రెడిట్ మానిటరింగ్ విభాగంలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 65 సంవత్సరాలకు మించకూడదు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...