UGC NET 2022 Application: యూజీసీనెట్ 2022 దరఖాస్తు ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి! చివరితేది ఇదే!

డిసెంబరు 29న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు జనవరి 17 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు.

Continues below advertisement

దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు)-2022 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 29న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు జనవరి 17 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో రెండు షిఫ్టుల్లో పరీక్ష ఉంటుంది. మొదటి షిఫ్టులో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్టులో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

Continues below advertisement

వివరాలు..

* యూజీసీ నెట్ - డిసెంబరు 2022

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 01.02.2023 నాటికి జేఆర్‌ఎఫ్ పోస్టులకు 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. - ugcnet.nta.nic.in.  

➥ అక్కడ హోంపేజీలో కనిపించే UGC NET 2022 లింక్ పై క్లిక్ చేయాలి.

స్క్రీన్‌పై వచ్చిన పేజీలో వివరాలను నింపి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. దాంతో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

➥ ఆ తరువాత, మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. UGC NET 2022 అప్లికేషన్ ఫామ్‌ను ఫిల్ చేయాలి.

అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి, ఆన్‌లైన్‌లో ఫీ చెల్లించాలి.

➥ అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని పెట్టుకోవాలి.

ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్-రూ.11,00; ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(నాన్-క్రిమిలేయర్)-రూ.550; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్-రూ.275 చెల్లించాలి.

పరీక్ష విధానం..

ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.

➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్. 

ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు-చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడురు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తూర్పుగోదావి-సూరంపాలెం, పశ్చిమగోదావరి-తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ముఖ్యమైన తేదీలివే..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 29.12.2022.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 17.01.2023 (5 PM) 

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 18.01.2023 (11.50 PM) 

దరఖాస్తుల సవరణకు అవకాశం: 19-20.01.2023 (11.50 PM) 

➥ ఎగ్జామ్ సిటీ వివరాల వెల్లడి: 2023 ఫిబ్రవరి మొదటివారంలో.

అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్: 2023 ఫిబ్రవరి రెండోవారంలో.

➥ UGC NET 2023 పరీక్షలు: 21.02.2023 - 10.03.2023. 

ఆన్సర్ కీ వెల్లడి: తర్వాత తెలియజేస్తారు.

Notification

Online Application

Website 

Also Read

CBSE Exams Schedule: సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, పరీక్షల తేదీలివే!
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పదోతరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మొదలై మార్చి 21వరకు కొనసాగనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్ 5వరకు జరుగుతాయని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు మొదలవుతాయని వెల్లడించింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకొని డేట్ షీట్‌లను తయారు చేసినట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలిపింది
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

సీయూఈటీ పీజీ ప్రవేశ పరీక్ష షెడ్యూలు విడుదల, పరీక్ష తేదీలివే!
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌ (సీయూఈటీ) తేదీలను యూజీసీ ఖరారు చేసింది. సీయూఈటీ పరీక్షలు 2023, జూన్‌ 1 నుంచి 10 రోజుల పాటు జరుగనున్నట్లు తెలిపింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ డిసెంబరు 29న ప్రకటించారు. దేశంలోని అన్ని కేంద్రీయ  విశ్వవిద్యాలయాల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement