దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పదోతరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మొదలై మార్చి 21వరకు కొనసాగనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్ 5వరకు జరుగుతాయని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు మొదలవుతాయని వెల్లడించింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకొని డేట్ షీట్‌లను తయారు చేసినట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలిపింది. 



సీబీఎస్‌ఈ 10వ తరగతి షెడ్యూలు ఇలా..





12వ తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే.. 






Also Read:


తెలంగాణ పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు ఇదే! క్వశ్చన్ పేపర్ ఇలా!
తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూలును ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు, 13న ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.
పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యలూ కోసం క్లిక్ చేయండి..


CUET PG Exam: సీయూఈటీ పీజీ ప్రవేశ పరీక్ష షెడ్యూలు విడుదల, పరీక్ష తేదీలివే!
యూజీసీ - నెట్ (UGC-NET) డిసెంబర్-2022 పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను ఫిబ్రవరి 23 నుంచి మార్చి 10వరకు నిర్వహించనున్నట్టు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ వెల్లడించారు. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షకు డిసెంబర్ 29 నుంచి జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జగదీశ్ కుమార్ తెలిపారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


విద్యార్థులకు షాకిచ్చిన ఎన్టీఏ, ఈ పట్టణాల్లో 'జేఈఈ' పరీక్ష కేంద్రాల ఎత్తివేత!
తెలంగాణలో జేఈఈ మెయిన్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెద్ద షాకిచ్చింది. రాష్ట్రంలో నాలుగు పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. జేఈఈ పరీక్షలు నిర్వహించే పట్టణాల జాబితా నుంచి రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, గద్వాల, మంచిర్యాల, వికారాబాద్‌ కేంద్రాలను తొలగించింది. గతేడాది రాష్ట్రంలో 21 పట్టణాల్లో జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహించగా, ఈ ఏడాది 17 పట్టణాలకే పరిమితం చేసింది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..