Uttar Pradesh: యూపీలో బుల్డోజర్‌ల భయం- 2 వారాల్లో 50 మంది క్రిమినల్స్ సరెండర్!

ABP Desam Updated at: 28 Mar 2022 07:47 PM (IST)
Edited By: Murali Krishna

ఉత్తర్‌ప్రదేశ్‌లో బుల్డోజర్లకు భయపడి క్రిమినల్స్ సరెండర్ అవుతున్నారు. 2 వారాల్లో 50 మంది నేరస్థులు సరెండర్ అయినట్లు పోలీస్ అధికారి తెలిపారు.

యూపీలో బుల్డోజర్‌ల భయం

NEXT PREV

ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ క్రిమినల్స్‌లో భయం మొదలైంది. 2 వారాల్లో 50 మంది నేరస్థులు సరెండర్ అయినట్లు ఓ నివేదికలో తేలింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్లీ బుల్డోజర్లు బయటకు తీస్తామని యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో చాలా సార్లు చెప్పారు. ఆ భయంతోనే ఇప్పుడు నేరస్థులు సరెండర్ అవుతున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో అధికారులు కూల్చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్‌పై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.. 'బుల్డోజర్ బాబా' అని విమర్శలు కూడా చేశారు.


యోగి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చాలా మంది నేరస్థులు "నన్ను చంపొద్దు, నేను లొంగిపోతున్నాను" అని రాసి ఉన్న ప్లకార్డులను మెడలో వేసుకుని పోలీసు స్టేషన్లకు వచ్చారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.



2 వారాల్లో 50 మంది వరకు క్రిమినల్స్ పోలీస్ స్టేషన్లకు వచ్చి సరెండర్ అయ్యారు. అంతేకాకుండా ఇంతకుముందు చేసిన నేరాలను కూడా ఒప్పుకున్నారు.                                                       - ప్రశాంత్ కుమార్, అదనపు డీజీపీ (శాంతి భద్రతలు)



భారీ విజయం


ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భాజపా భారీ విజయాన్ని సాధించింది. వరుసగా రెండోసారి యూపీలో సర్కార్‌ను ఏర్పాటు చేసింది. 





గోరఖ్‌పుర్ అర్బన్ నుంచి పోటీ చేసిన యోగి.. 1,03,390 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం యోగికి ఇదే తొలిసారి. యూపీ సీఎంగా ఐదేళ్ల పాటు పూర్తి పదవీకాలం పనిచేసి ఓ ముఖ్యమంత్రి తిరిగి అధికారంలోకి రావడం 37 ఏళ్లలో ఇదే తొలిసారి.




403 అసెంబ్లీ స్థానాల్లో 255 సీట్లు గెలుచుకుంది భాజపా. తన మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్)కు 12 స్థానాలు దక్కాయి. మరో మిత్రపక్షం నిషాద్ పార్టీ 6 చోట్ల గెలుపొందింది.


మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన సమాజ్‌వాదీ పార్టీకి 111 సీట్లు దక్కాయి.


మరోవైపు భాజపా దెబ్బకు కాంగ్రెస్‌, బహుజన సమాజ్‌ పార్టీలు కొట్టుకుపోయాయి. యూపీ చరిత్రలో ఎన్నడూలేనంత తక్కువ సీట్లు సాధించాయి. కాంగ్రెస్ రెండంటే రెండు సీట్లలో గెలుపొందితే, బీఎస్పీ ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 7 సీట్లు, బీఎస్సీ 19 సీట్లు పొందాయి. సీట్లు పెరగకపోగా దారుణంగా తగ్గడం ఆ పార్టీల శ్రేణులను నిరాశ పరుస్తోంది.





Published at: 28 Mar 2022 07:42 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.